ఆయన వైసీపీ ఎంపీ. పైగా సీఎం జగన్.. స్వయంగా తనకు సోదరుడు, తమ్ముడు అని పదే పదే చెప్పుకొం టున్న కీలక నాయకుడు. అయితే.. ఇప్పుడు ఆయనకు తడిసిపోతోందని అంటున్నారు రాజకీయ విశ్లేష కులు. ఆయనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఆయనకు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన బిక్క చచ్చి పోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారంటే.. ఆయనను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం రెడీ చేసుకుందని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర మంత్రి మనీష్ సిసోయడియాకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 కిందే సీబీఐ నోటీసులు ఇచ్చి విచారించి .. ఆ వెంటనే అరెస్టు చేసింది. అనంతరం తీహర్ జైలుకు తరలించారు. ఇదే ఇప్పుడు అవినాష్‌కు సైతం చెమటలు పట్టిస్తొందని చెబుతున్నారు.
దీంతో అవినాష్ హుటాహుటిన తెలంగాణ హైకోర్టు(వివేకానందరెడ్డికేసును విచారిస్తున్న కోర్టు)ను ఆశ్ర యించారు. తనను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన వేడుకున్నారు. ఇప్పుడు కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఎంపీ భవిష్యత్తు ఆధారప డి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రేపు సీబీఐ కనుక అరెస్టు చేస్తే.. అది అవినాష్ కంటే కూడా వైసీపీకి ఎన్నికలకు ముందు తీవ్ర దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు.. వివేకానందరెడ్డి హత్యను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో లబ్ధి పొందిన వైసీపీ.. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు అదే కేసులో ఇరకాటంలో పడడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.