కర్నూలు జిల్లా రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సుపరిచితులు. ఆ మాటకు వస్తే జిల్లాలోనూ ఆయన గురించి అవగాహన ఉన్న వారు తక్కువే. కానీ.. ఆదోనీ బెల్ట్ లో ఉన్న వారు మాత్రం ఆయన్ను వెంటనే గుర్తు పడతారు. ఆయన ప్రత్యేకత ఏమంటే.. మాస్ నాయకుడు కాకున్నా.. ఆయన ఎమ్మెల్యే గా మాత్రం విజయం సాధిస్తూ ఉంటారు.
సీనియర్ కాంగ్రెస్ నేతగా సుపరిచితుడు.. తర్వాతి కాలంలో వైసీపీలో భాగస్వామి అయ్యారు. మాస్ నేతలకు భిన్నంగా వ్యవహరించే ఈ పెద్దాయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందని చెప్పాలి.
ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. సాధారణంగా హెడ్ లైన్స్ లో దర్శనమివ్వరు.
తాజాగా ఆయన నోటి నుంచి వ్యాఖ్యల పుణ్యమా అని.. ప్రధాన వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక వ్యాఖ్య కారణంగా ఆయన పేరు సోషల్ మీడియాలోనూ.. వార్తల్లోనూ వినిపిస్తోంది. దీనికి కారణం.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య ఆ తరహాలోనిది. స్కూల్ స్టూడెంట్లకు ట్యాబ్ లు ఇవ్వటం కారణంగా చెడిపోతున్నారన్న మాటకు ఆయన కాస్తంత ఘాటుగా రియాక్టు అయ్యారు.
కొందరు ఎమ్మెుల్యేలే అశ్లీల (బూతు) బొమ్మలు చూస్తున్నారని.. పెద్ద పట్టణాల్లోని కొందరు డబ్బున్న వారు బూతు బొమ్మలు చూస్తుంటారన్నారు. అలాంటిది విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ ల వల్ల చెడిపోతున్నారని చెప్పటం సమంజసం కాదన్నారు. ఒకవేళ కొందరు విద్యార్థులు అలాంటి పనులు చేస్తున్నా.. ఆ పేరు చెప్పి అందరిని ఒకే గాటున పడేయటం సరికాదంటూ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వటంతో చెడిపోతున్నారన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు.. ఆయన్ను వార్తల్లో వ్యక్తిగా మార్చేశాయి.