గొడ్డలితో నరికినంత గాయం.. తీవ్ర బాధ.. అంతకుమించిన నొప్పి.. అయినా.. నోరు విప్పి చెప్పుకోలేని పరి స్థితి! కుయ్యో.. మొర్రో.. అని అనలేని దుస్థితి. ఇదీ.. జగన్ మార్క్ రాజకీయం. వచ్చే ఎన్నికలకు సంబం ధించి .. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. గడప గడపకు పేరు నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రెస్‌పై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలకు తన మనసులో ఉన్న మాట చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి గెలుపు వారిదేనని వెల్లడించారు.
అంతేకాదు.. అసలు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు.. అనుకున్న వారికే టికెట్లు ఇస్తానన్నారు. దీనికిగాను.. ప్ర జల్లోకి బలంగా తిరగాలని.. అన్నారు. తాను బటన్ నొక్కుతున్నానని.. అంతకు మించి ఏమీ చేయలేనని .. ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేశానని చెప్పారు. ఇక, దీనిని ముందుకు తీసుకువెళ్లాల్సింది మీరేనని చెప్పా రు. అయితే.. ఇక్కడే జగన్ పెద్ద వ్యూహం వేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్ని కల్లో ఎవరినీ గెలిపించే బాధ్యతను ఆయన తీసుకోడు. అంతేకాదు.. ఇప్పుడు.. ఎవరికి వారిని బలోపేతం కావాలని కోరుతున్నాడు.
దీనినిబట్టి..తనను చూపించి.. ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం ఈ దఫా చేయనట్టే కనిపిస్తోంది. అంటే.. తన ను చూసి ఓటేయండి.. అని గత ఎన్నికల్లో చెప్పకనే చెప్పిన జగన్.. ఇప్పుడు మాత్రం ప్రజలకు ఈ పిలు పు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆయన పాలనపై ప్రజలు అంత వ్యతిరేకతతో ఉన్నట్టు.. సొంత పార్టీలోనే ఓ వర్గం గుసగుసలాడుతోంది. అదేసమయంలో అంటే.. తాను సీఎం కావాలంటే.. ఇక, తన ప్రయత్నం.. తన ప్రమేయం వల్ల ఎలాంటి ప్రయోజనంలేదనే నిర్ణయానికి వచ్చేసినట్టు చెబుతున్నారు.
అందుకే.. ఇప్పుడు భారమంతా..(అంటే.. తనను గెలిపించి.. ముఖ్యమంత్రిని చేసే బాధ్యత) ఎమ్మెల్యేల పైనే పెడుతున్నారు. ఇక, ఎమ్మెల్యేలు.. తమ గెలుపు కోసం.. కష్టపడితే.. ఆటోమేటిక్‌గా.. జగన్ ముఖ్యమం త్రి అవుతారు కదా! అంటే.. ఇక్కడ ప్రజల్లో తన ఇమేజ్ పడిపోయినా.. ఎమ్మెల్యేల కష్టంతో మెట్టు ఎక్కే యచ్చన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇంత కష్టపడినా.. తనకు నచ్చిన వారికే టికెట్లు ఇచ్చుకునే అవకాశాన్ని జగన్ తన చేతిలోనే పెట్టుకోవడం.
ఇక్కడ చిత్రమైన విషయం. అంటే.. ఎక్కడైనా ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే.. తప్పు నాది కాదు.. నువ్వు తిరగలేదు.. నీకు మైనస్ మార్కులు వచ్చాయి అందుకే.. టికెట్ లేదు.. అని చెప్పేందుకు.. చేతులు దులుపుకొనేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు ప రిశీలకులు. ఇదొక కొత్త రాజకీయ ఎత్తుగడగా చెబుతున్నారు.