ధర్మవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిత్యం తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న చెరువును ఆక్రమించుకోలేదంటూ కేతిరెడ్డి చెప్పగా…ఆధారాలతో సహా లోకేష్ ఆయన గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫ్రస్ట్రేషన్ ను కేతిరెడ్డి ఓ సభలో వెళ్లగక్కుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చాకిరి చేయడం తప్ప తనకు, తన కుటుంబ సభ్యులకు వేరే పనే లేకుండాపోతోందంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ధర్మవరం పట్టణంలో ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో కేతిరెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు భోజనాలకు వెళ్తున్నారు. అది చూసి వారిపై కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘టిఫిన్లు ఇప్పుడే తిన్నారు. అప్పుడే అన్నానికి పోతున్నారు. దేనికీ తట్టుకోలేరు కాబట్టే.. మన బతుకులు ఇట్లున్నాయి…ఏం పది నిమిషాలు ఆగలేరా’’ అంటూ మహిళలపై మండిపడ్డారు.
‘‘పొద్దున 6.30 నుంచి 9.30 గంటల వరకు నేను వీధుల్లో తిరుగుతాను. 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నా భార్య తిరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నా తమ్ముడు తిరుగుతున్నాడు. మా కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడం తప్ప వేరే పనే లేకుండాపోతోంది… ఇంత చేసినా మా మీద ఏడుపే…నా మీద ఏవో కేసులు పెడుతున్నారు…అరేయ్ డెకాయిట్ నాకొడకల్లారా’’ అంటూ కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేతిరెడ్డి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Kethi Reddy Frustration at Peaks ..????
పెళ్ళాం,తమ్ముడు…..కొంపలో అంతా మీకు చాకిరి చేయాడం తప్ప మాకు వేరే పనే లేకుండా పోతుంది …..????
మధ్యలో జనాలు భోజనాలు కోసం ఉరుకుతున్నారు…..ఇప్పుడేగా టిఫెన్లు అయినాయి???? pic.twitter.com/XRfqrLd6Jj
— Chakri Movva (@ChakriMovva) April 15, 2023