జగనన్ను ముద్దు.. ఎమ్మెల్యే వద్దు! అనే నినాదం.. సహజంగానే కొన్ని నియోకవర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. అంతో ఇంతో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు సానుభూతి కూడా కనిపిస్తోంది. కానీ, రాష్ట్రం మొత్తం మీద.. ఒక్క వినుకొండ నియోజకవర్గం(ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉంది)లో మాత్రం ఏ వర్గాన్ని కదిపినా.. “బొల్లా వద్దులేబ్బా!“ అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం. మెజారిటీ ప్రజలు.. గత ఎన్నికల్లో తప్పు చేశామని కూడా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు బాహాటంగానే చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో తప్పు చేశాం.. అంటూ.. మరింకొందరు.. మీడియా ఉముందు కూడా ఎలాంటి జంకు గొంకు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి రెడ్డి సామాజిక వర్గం వైసీపీ నాయకులకు అండగా ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలే రు. గత ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని.. మరీ రెడ్డి నాయకులు.. వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడును గెలిపించారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత.. కనీసం తనను గెలిపించిన రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకోకుండా తనదే గెలుపు అన్నట్టుగా బొల్లా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
దీంతో రెడ్డి సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లోబొల్లాకు సహకరించేది లేదని తెగేసి చెబుతోంది. ఇక్కడ మరో నాయకుడికి అవకాశం ఇవ్వాలని.. లేకపోతే.. బొల్లాను తామే ఓడిస్తామని కూడా రెడ్డి సామాజిక వర్గం కుండబద్దలు కొడుతుండడం గమనార్హం. ఇక, వైసీపీ కేడర్ కూడా.. బొల్లాకు సహకరించే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ముద్దు.. ఎమ్మెల్యే వద్దు నినాదంతో ప్రతి మండలంలోనూ.. గ్రామాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలతో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు పరిశీలకులు.
అంతేకాదు.. ఇటీవల నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర కూడా.. భారీ ఎత్తున హిట్టయిం ది. ఈ పరిణామాలను గమనించిన వారు.. బొల్లాపని అయిపోయిందని.. ఇక, తట్టా బుట్టా సర్దు కోవాల్సిందే నని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.