రాజకీయాల్లో శపథాలు చేయడం నాయకులకు పొలిటికల్‌గా పెట్టిన విద్య. తమ స్థాయి.. తమ దూకుడు ను ఏమాత్రం అంచనా వేసుకోకుండానే నాయకులు శపథాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి వారిలో గిద్దలూరు ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నారాంబాబు ముందు వరుసలో నిలిచారు. తనను వైసీపీ లో తొక్కేశారంటూ.. ఆయన కొన్నాళ్లుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు ఆ ఆరోపణలతోనే రోడ్డెక్కారు. ‘‘వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుం ది. ఆ సామాజిక వర్గం నన్ను చాలా ఇబ్బందులు పెడుతోంది. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకో లేదు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది? వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తా’’ అని రాంబాబు శపథం చేశారు.
అయితే.. రాంబాబు శపథాలు జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నియోజకవర్గం ప్రజలకు కూడా కొత్తకాదు. గతం లో టీడీపీలో ఉన్నప్పుడుకూడా.. జిల్లాలో టీడీపీని ఓడిస్తానంటూ.. శపథాలు చేశారు. కానీ, ఆయన చేసిన శపథం ఏమై పోయిందో ఎవరికీ తెలియదు. ఇక, ఆ తర్వాత.. ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత వైసీపీలోకి చేరిపోయారు. ఇక్కడ ఆయన మంచి ఆదరణే దక్కింది. ఏకంగా జగన్‌ను తొలి ఏడాది ఎలాంటి అప్పాయింట్మెంట్ కూడా లేకుండా వెళ్లి కలుసుకున్నారు.
అయితే.. ఎక్కడైనా కామనే అన్నట్టుగా సహజంగానే రెడ్డి సామాజిక వర్గం నుంచికొంత ఆధిపత్యం ఎదు రైంది. దీనిని అన్నా జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ..అ ధిష్టానంఆయనకు అనేక సందర్బాల్లో సర్ది చెప్పింది. కానీ.. ఒకానొక సందర్భంలో అధిష్టానాన్నే ఎదిరించారు. పైగా మంత్రి పదవి దక్కక పోవ డం వెనుక మాగుంట ఉన్నారనే ఉద్దేశంతో రోడ్డెక్కి యాగీ కూడా చేశారు. చివరకు పార్టీలోనే పలచనయ్యా రు. ఈ పరిణామాలతోనే ఆయనను పార్టీ పక్కన పెట్టింది.
ఇక, ఇప్పుడు ఏకంగా సీటుకు ఎసరు వస్తోందని తెలియడంతో అన్నా తప్పుకొన్నారు. పోటీ చేయనని చెప్పుకొచ్చారు. ఇంత వరకు గౌరవంగా బాగానే ఉంది. కానీ.. మాగుంటను ఓడిస్తానని.. జిల్లా అంతా పర్యటిస్తానని శపథం చేయడమే.. ఆయనపై మరిన్ని విమర్శలు వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు. ఈ శపథాలు పనిచేయవన్నా! అని వైసీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.