జగన్ ను దూషించారనే ఆరోపణలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత సభలో జగన్ ను అయ్యన్న దూషించారని వచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నేడు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడును అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు.
అయ్యన్న పాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడాని వచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలిని నిప్పులు చెరిగారు. ఉచ్ఛనీచాలు మరచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం పోలీసులు స్పందించలేదని దుయ్యబట్టారు.
మా @AyyannaPatruduC గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి. ఉచ్ఛనీచాలు మరచి వైసిపి నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయి.(1/3) pic.twitter.com/3ZCgYbZ5uR
— Lokesh Nara (@naralokesh) February 23, 2022