వైసీపీ నేతల శృంగార లీలలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం కొత్తేమీ కాదు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లకు సంబంధించిన ఆడియోలు.. గోరంట్ల మాధవ్‌కు చెందిన వీడియో అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఐతే మామూలుగా ఇలా ఎవరివైనా ప్రైవేట్ ఆడియోలు, వీడియోలు బయటికి వస్తే.. వారిని సస్పెండ్ చేయడం, లేదంటే సైలెంట్‌గా సైడ్ చేయడం చేస్తుంటాయి పార్టీలు.
కానీ వైసీపీ తీరే వేరు. నవ్విపోతే నాకేంటి సిగ్గు అన్న తరహాలో ఇలాంటి వ్యవహారాలను లైట్ తీసుకుని ఆయా నేతలను పార్టీలోనే కొనసాగించారు. కొందరికి ఉన్నతమైన పదవులు కూడా ఇచ్చారు. ఐతే అధికారంలో ఉన్నపుడు ఏం చేసినా చెల్లుతుంది కానీ.. అది పోయినపుడు ఇలాంటి వ్యవహారాలు బయటికి వస్తే పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినడం గ్యారెంటీ. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి గురించి జగన్ సహా వైసీపీ నేతలు ఎన్ని వెకిలి కామెంట్లు చేశారో తెలిసిందే. అందులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. పవన్ గురించి దారుణమైన కామెంట్లు చేసిన దువ్వాడ.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యాపిల్లల్ని విడిచిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చి రెండు మూడు రోజులుగా దీని గురించి రచ్చ రచ్చ జరుగుతోంది. టీవీ ఛానెళ్లకు ఈ అంశంతో మంచి మసాలా దొరికినట్లు అయింది.
వాళ్లు వైసీపీని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల రాసలీలలకు సంబంధించి మరిన్ని వీడియోలు బయటికి రాబోతున్నట్లుగా ఈ చర్చల్లో న్యూస్ ప్రెజెంటర్లు, వేరే వ్యక్తులు చెబుతుండడం గమనార్హం. ఉత్తరాంధ్ర అగ్రనేత బొత్స సత్యనారాయణకు చెందిన వీడియోలేవో రాబోతున్నాయంటున్నారు. అలాగే కాకినాడ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా ఏదో బయటపెట్టబోతున్నారట. సీమ రాజాగా ఫేమస్ అయిన ఓ వ్యక్తి అయితే ఏకంగా వైఎస్ జగన్ రాసలీలల వీడియోలే అతి త్వరలో రిలీజ్ చేస్తామని ఘంటాపథంగా చెబుతుండడం గమనార్హం.