వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. అది ఫేక్ వీడియోనా, మార్ఫింగ్ చేసిన వీడియోనా, ఒరిజినల్ వీడియోనా అన్నది పక్కనబెడితే…ఈ వ్యవహారంతో మాత్రం వైసీపీ ఇరకాటంలో పడింది. ఆల్రెడీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో సతమవుతున్న వైసీపీ నేతలను ఇది మరింత ఇరకాటంలోకి నెట్టింది. అందుకే, వైసీపీ నేతలు కూడా ఈ వీడియో ఫేక్ అని, టీడీపీ కుట్ర అని ఎక్కడా కామెంట్లు చేయడం లేదు.
మాధవ్ చెప్పిన విధంగా అది మార్ఫింగ్ చేసిన వీడియో అని చెప్పడానికి వైసీపీ నేతలు ఇష్టపడటం లేదు. ఒకవేళ ఈ వివాదం గురించి స్పందిస్తే తాము కూడా అనవసరంగా ఆ వివాదంలో ఇరుక్కుంటామనే భావనలో వైసీపీ నేతలున్నారట. అందుకే, ఆ వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారే తప్ప…ఇదంతా టీడీపీ రాజకీయం అని ఎక్కడా అనలేదు.
పై పెచ్చు ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని చాలా స్పష్టంగా కనిపిస్తుందని చాలామంది అంటుండడంతో గోరంట్ల మాధవ్ కు మద్దతుగా వైసీపీ మీడియా సైతం కథనాలను ప్రచురించడానికి భయపడుతోంది. ఇక, మరోవైపు, హిందూపురం ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రిజైన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. జగన్ ఆదేశిస్తే గోరంట్ల మాధవ్ పదవికి రాజీనామా చేయక తప్పదని కొందరు అంటున్నారు.
మరోవైపు, వైసీపీలో కొందరు నేతలకు మాధవ్ అంటే గిట్టదని, ఆయన రుబాబు ధోరణి అంటే పడదని టాక్ ఉంది. వారే మాధవ్ వీడియోను లీక్ చేసి ఆయనను ఇరకాటంలో పడేశారన్న వదంతులు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆ వీడియో కాల్ విషయంలో మాధవ్ కు వ్యతిరేకంగానే ఉన్నారట. ఆల్రెడీ డిఫెన్స్ లో ఉన్న పార్టీ…మాధవ్ వల్ల మరింత డిఫెన్స్ లో పడిందని అనుకుంటున్నారట.