వైసీపీ నాయకులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై 2022లో జరిగిన దాడికి సంబంధించి సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో వైసీపీ కీలక నేతలు కూడా ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్, తలశిల రఘురాం సహా .. పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు. వీరంతా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. సుదీర్ఘ విచారణల తర్వాత.. ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించిం ది. ఇదేసమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా గడువు ఇవ్వలేదు. దీంతో పోలీసులు వీరి కోసం వేట ప్రారంభించారు.
ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గురువారం తెల్లవారుజామునే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. ఇక, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గురువారం సాయంతం గుంటూరులో అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆయనను శుక్రవారం కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతంలోనూ ఆయన దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించిన ట్టు వార్తలు వచ్చాయి. అయితే..అ ప్పటికే ఆయనపై లుక్ ఔట్ నోటీసులు ఉండడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు.
ఇక, ఇప్పుడు దేవినేని అవినాష్.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు నివాసంపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా.. హైకోర్టు ఇవ్వలేదు. ఇదేసమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం కోరినా.. ససేమిరా అంది. దీంతో జోగిని అరెస్టు చేసేందుకు కూడా సీఐడీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయన కూడా తప్పించుకుపో యారు. దీంతో అటు టీడీపీ ఆఫీసు, ఇటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులైన వైసీపీనాయకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.