2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ కుదేలైన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకట రమణ మొదలు బాలినేని శ్రీనివాస రెడ్డి వరకు ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా వేరే పార్టీలోకి జంప్ చేశారు. 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో సైతం అడుగుపెట్టలేని స్థితిని చాలామంది వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో పక్క పార్టీల వైపు మరికొంత మంది వైసీపీ నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది.
2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీతో కన్నబాబు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ క్యాడర్ కు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.
కాకినాడ వైసీపీ అధ్యక్షుడిగా క్రియాశీల పాత్ర కూడా పోషించడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై రచ్చ జరుగుతోన్నా..తిుపతి లడ్డూ వివాదం అయినా మీడియా ముందుకు కూడా రావడం లేదు. జనసేన లేదా బీజేపీలో చేరే యోచనలో కన్నబాబు ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో అవకాశం కోసం ఢిల్లీ స్థాయిలో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.