పొమ్మనలేక పొగబెడుతున్న తీరు వైసీపీ లో చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్లు ఇచ్చే ది లేదని సీఎం జగన్ కొందరు నేతలకు చెప్పేశారు. అంతేకాదు.. దీనిపై వ్యతిరేకత వచ్చిన దరిమిలా.. ఆయన మాటమార్చి.. అందరికీ టికెట్లు ఇస్తామని.. అయితే.. ప్రజల్లో మీరు గ్రాఫ్ పెంచుకోవాలని సూచిం చారు.దీనిని కొందరు నమ్మారు. మరికొందరు నమ్మలేదు. నమ్మని వారు వారి దారిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలావుంటే.. కొందరు నేతలకు ప్రజల నుంచి సెగ తగులుతోంది. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై చెప్పులు విసిరే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా.. ఎమ్మెల్యేలపై ప్రజలు నిప్పులు చెరిగారు. అయితే, ఇది నిజమేనా ? అనేది పెద్ద చర్చగా మారింది. శంకరనారాయణ అనుచర వర్గం.. ఈ విషయంపైనే దృష్టి పెట్టింది. గతంలో ఇదే గ్రామానికి వెళ్లినప్పుడు హారతులు పట్టారు.
అలాంటిది అనూహ్యంగా ఆయనపై చెప్పులు పడ్డాయి. దీనిని పరిశీలించిన శంకరనారాయణ ఏం జరుగు తోందో తెలుసుకున్నారట. కొందరు ఉద్దేశ పూర్వకంగా.. దీనిని వెనుక ఉండి నడిపిస్తున్నారని తెలుసుకు న్నారు. అది ఏకంగా కీలక నేతల ఆదేశాల మేరకు.. ఇలానే జరిగిందని అంటున్నారు. ఇక, విశాఖలోనూ కన్నబాబు రాజుపై ఇలానే వ్యతిరేకత కనిపిస్తోంది. సరే.. ఆయన కొంత దూకుడు ప్రదర్శిస్తారు కాబట్టి.. సరే అనుకున్నారు.
కానీ, లోతుగా పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని భావించిన పార్టీ అధినాయకత్వం.. కొందరి విషయంలో అసంతృప్తి రెచ్చగొట్టి నేతలను రంగంలోకి దింపి.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేలా చేస్తోందన్నది ప్రస్తుతం వైసీపీలో సాగుతున్న ప్రచారం. అయితే, దీనిలో నిజం ఎంత ఉన్నదనేది తెలియదు కానీ.. నేతలు మాత్రం తల్లడిల్లుతున్నారు. టికెట్ ఇవ్వబోమని చెబితే.. తమ దారి తాము చూసుకుంటామని, ఇలా అవమానించడం ఎందుకని లోలోన కుమిలిపోతున్నారు.