వైసీపీ లో కొద్ది రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం జగన్ ఫిట్టింగ్ పెడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సర్వేలు, సమీకరణాలు అంటూ చాలామంది వైసీపీ నేతల సొంత నియోజకవర్గాల నుంచి వారిని జగన్ ట్రాన్స్ ఫర్ చేస్తున్న వైనంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఫిట్టింగ్ లిస్ట్ లు విడుదల కాగా..చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా సరే, తాజాగా జగన్ ముచ్చటగా మూడో సిట్టింగ్ ఫిట్టింగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక, వైసీపీలో చేరకుండానే ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభ టికెట్ ను కేశినేని నాని దక్కించుకోవడం ఈ లిస్ట్ కే కొస మెరుపు.
6 ఎంపీ స్థానాలు ఉండగా, 15 ఎమ్మెల్యే స్థానాలు..వెరసి మొత్తం 21 మందితో మూడో జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా, తిరుపతి లోక్ సభ ఇన్ చార్జిగా కోనేటి ఆదిమూలం ను నియమించారు. మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. ముచ్చటగా మూడో లిస్ట్ లో సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
21 మంది ఇన్చార్జిల జాబితా….
లోక్ సభ స్థానాల ఇన్ చార్జిలు
శ్రీకాకుళం – పెరాడ తిలక్
విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరి జయరాం
తిరుపతి – కోనేటి ఆదిమూలం
అసెంబ్లీ స్థానాల ఇన్ చార్జిలు
ఇచ్చాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి -కంభం విజయ రాజు
రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతల పట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పాల రాము
శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.