నిజాలు బట్టబయలయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల వెనుక ఉన్న కథ గుట్టు విడిపోయింది. వీటి ద్వారా.. అంటే.. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకువచ్చిన నాటి నుంచి(2018లో బీజేపీ ప్రభుత్వమే తీసుకువచ్చింది. అప్పటి ఎన్నికలకు ముందు ఈ తతంగం తెరమీదికి వచ్చింది. ఆ వెంటనే దీనిని చట్టబద్ధం చేశారు.అ యితే.. చిత్రం ఏంటంటే.. దీనిని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చివరకు కామ్రెడ్స్ కూడా. ఎందుకంటే.. ఈ బాండ్లు.. అన్ని పార్టీలకూ.. కోట్లు కురిపించేవి. పైగా ఎవరు ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి) ఇప్పటి వరకు.. బీజేపీకి వచ్చిన లబ్ది తెలిసిపోయింది. అదేవిధంగా ఏపీలో వైసీపీకి అందిన ప్రయోజనం బట్టబయలైంది. ఈ క్రమంలో 300 కోట్ల రూపాయల పైచిలుకు.. వైసీపీకి అందాయి. వీటిని ఎవరు ఇచ్చారో తెలియదు.
కానీ, కాలం అన్ని వేళలా ఉండదు. తాజాగా ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ.. అసలు ఈ నిర్ణయమే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఏయే పార్టీ ఎంతెంత సొమ్ము వెనుకేసుకుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సుప్రీకోర్టుకు నివేదిక అందింది. దీని ప్రకారం.. బీజేపీ 6 వేల కోట్లకు పైగానే ముట్టాయి. వీటిని ఎవరిచ్చారో.. ఎలా ఇచ్చారో మాత్రం తెలియక పోవడం గమనార్హం. అసలు ఈ బాండ్ల వెనుక ఉన్న పెద్ద గుట్టు ఇదే కావడం గమనార్హం.
2017-18 నుంచి ఎలక్టోరల్ బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది. దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ దీనిని అమలు చేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 30 విడతల్లో దాదాపు 28వేల ఎన్నికల బాండ్లను ఈ బ్యాంకు విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లుగా ఉంది.
జాతీయ పార్టీలకు అందిన విరాళాలు ఇవీ..
+ బీజేపీ రూ.6,565 కోట్లు, కాంగ్రెస్ – రూ. 1,122 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీకి రూ.382.44 కోట్లు విరాళాల రూపంలో రాగా.. టీడీపీకి రూ.146 కోట్లు వచ్చాయి. ఇక, బీఆర్ ఎస్ పార్టీకి రూ.383 కోట్లు అందాయి.