టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం అక్కర లేదు. అవసరమైన, అనవరసరమైన విషయాలలో వేలు, కాలు పెట్టి మరీ వివాదాస్పదం చేయడం వర్మకు వెన్నతోపెట్టిన విద్య అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. ఎవడేమనుకుంటే నాకేంటి…నాకనిపించింది నేను చెబుతా అన్నది వర్మ నైజం. గతంలో తన వ్యాఖ్యలతో పలు వివాదాలకు కేంద్ర బిందువైన వర్మ…తాజాగా ఆర్జీవీ డెన్ అంటూ తన కొత్త ఆఫీసును ఓపెన్ చేయడం, ఆ ఆఫీస్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం తెలిసిందే. ఆర్జీవి డెన్ లోపలికి అడుగుపెడితే చాలు మహిళల అసభ్యకరమైన ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
వర్మ డెన్ లో అరికాళ్ళ నుంచి మెడ వరకు అంగాంగ ప్రదర్శన చేస్తున్న అతివల ఫోటోలు, ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ డెన్, ఫొటోల గోల పక్కనబెడితే ఇంత పెద్ద ఆఫీసు కట్టేందుకు వర్మకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఆ కామెంట్లపై స్పందించారు. ఈ మధ్యకాలంలో తన సినిమాలు పెద్దగా ఆడలేదని, పెద్ద లాభాలు కూడా రాలేదని వర్మ అన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఆఫీస్ బిల్డింగ్ కట్టేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు అడుగుతున్నారని, తనకు ఆ డబ్బులు దావూద్ ఇబ్రహీం ఇచ్చాడని వర్మ తనదైన శైలిలో వెటకారంగా సమాధానమిచ్చారు.
తనకు ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారని, ఎందుకు ఇవ్వాలని వర్మ తన ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ను ఎదురు ప్రశ్నించారు. ఇక, కొంతమంది తాను అమ్మాయిల కాళ్లు నాకడమేమిటి అని ప్రశ్నిస్తున్నారని, కొందరికి జామ కాయలంటే ఎలా ఇష్టమో తనకు అమ్మాయిల కాళ్లు నాకడం అలా ఇష్టం అని, ఆ టేస్ట్ ఇష్టమని వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఇష్టం వచ్చినట్టు, తన బతుకు తాను బతుకుతానని, తనకు నచ్చిందే నచ్చినట్టు చేస్తానని గతంలో 1000 సార్లు చెప్పానని వర్మ అన్నారు. అయినా, మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అంటూ యాంకర్ పై అసహనం వ్యక్తం చేశారు వర్మ.
ఇక, టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు, లోకేష్ లో పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే లక్ష్యంగా వర్మ సినిమాలు చేేస్తున్నారని సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఇచ్చిన డబ్బుతోనే 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీశారని, ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు జగన్ పై చిత్రం కూడా వైసీపీ నేతల డబ్బులతోనే, టీడీపీకి వ్యతిరేకంగా వర్మ తెరకెక్కిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవి డెన్ కట్టేందుకు కూడా వైసీపీ నేతలు డబ్బు సహకారం అందించారని టాక్ వస్తుంది.