పోస్టల్ బ్యాలెట్ లపై ఆర్వో సీల్ వ్యవహారంలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం-13ఏపై ఆర్వో సంతకం, స్టాంపు, హోదా వివరాల విషయంలో ఈసీ వాదనలను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈసీ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు క్లారిటీనిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆల్రెడీ ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయడంతో వైసీపీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు విన్న తర్వాతే ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకోవాలని, ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.