ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇంటా బయటా కూడా సెగ ప్రారంభమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో సెగ పుట్టిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల రెండో రోజు.. ధరలపై వాయిదా తీర్మానం ఇచ్చిన సభ్యులకు స్పీకర్ నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో సభ్యులు.. సభలోనే ఆందోళనకు దిగారు. అనంతరం.. వారంతా ప్లకార్డులు పట్టుకుని నినదాలు చేస్తూ.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో తీవ్ర స్తాయిలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, మరోవైపు.. బయటకు వచ్చిన టీడీపీ సభ్యులు సైకో పోవాలి.. సైకిల్ రావాలి! నినాదాలతో హోరెత్తించారు. సభ ప్రారంభం నుంచే టీడీపీ ఎమ్మెల్యేలు.. ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టారు. అయితే..గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం నేపథ్యంలో ఎలాంటి చర్చలకు అవకాశంలేదని పేర్కొన్నారు. దీంతో గలాటా ప్రారంభమైంది. దీంతో టీడీపీ సభ్యులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
ఒకానొక దశలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసేందుకు సభ సిద్ధపడడం గమనార్హం. ఇక, టీడీపీ అధినే త చంద్రబాబు నాయుడు.. బయట రా.. కదలిరా! సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా.. భారీ ఎత్తున ఆయన వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ పాలనపైనా.. సీఎం జగన్‌పైనా చంద్రబాబు విమర్శ లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో బయట కూడా వైసీపీకి కాక పెరిగింది.
అంటే.. మొత్తంగా కీలకమైన ఎన్నికలకు ముందు.. వైసీపీకి ఇటు అసెంబ్లీలోనూ.. అటు బయట కూడా.. ప్రధాన ప్రతిపక్షం వేస్తున్న దూకుడు అడుగులు.. వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయనడం లో సందేహం లేదు. మరి, చివరకు ఏం జరుగుతుందో చూడాలి. దీనిని వైసీపీ నాయకులు, అధిష్టానం ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.