సీఎం జగన్ రెండో సారి గెలిచేందుకు సిద్ధం పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించి యుద్ధానికి సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందని.. మీరే నా సైన్యమని వాలంటీర్ల సభలో వ్యాఖ్యానించిన ఆయన తర్వాత జరిగే పరిణామాలపై ముందుగానే అంచనా వేయలేకపోయారా? లేక కావాలనే చేస్తున్నారా? అనేది ప్రశ్నగా మారింది. జగన్ ఇస్తున్న పిలుపులు.. ఆయన ప్రచార వ్యూహం చూస్తూంటే.. `ఎన్నికల యుద్ధం` పేరుతో క్యాడర్ ను రెచ్చగొడుతన్నారని.. హింసాత్మక ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి పెరుగుతున్నాయి.
దానికి తగ్గ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ వ్యూహం.. భయపెట్టి ఎన్నికల్లో గెలవడమేనని.. మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామని విపక్షాలు అంటున్నాయి. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీ యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఎన్నికలకు వెళ్లదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీ రెండు పార్టీల మధ్య జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది అధికారంలో ఉన్న పార్టీ తమ పాలనపై ప్రజాతీర్పు ఇవ్వాలని వెళ్తుంది. అదే దిశగా ప్రచారం చేస్తుంది. కానీ వైసీపీ అసలు విషయం కన్నా యుద్ధానికి సిద్ధమన్నట్లుగా ప్రచారం చేస్తోంది.
కూటమిగా కట్టి మిగిలిన పార్టీలన్నీ వస్తున్నాయని.. మిమ్మల్ని నమ్ముకుని ఒక్కడిగా ఉన్నానని జగన్ మోహన్ రెడ్డి సభల్లో చెబుతున్నారు. తనకు రక్షణగా ఉండాలంటున్నారు. తన కోసం యుద్ధం చేయాలంటున్నారు. క్యాడర్ తో ఏర్పాటు చేసిన సిద్ధం సభల్లో.. అవే చెబుతున్నారు. వలంటీర్లతో ఏర్పాటు చేసిన సభలో మరో అడుగు ముందుకేశారు. చొక్కాలు మడత పెట్టాలని పిలుపునిచ్చారు. అంటే దాడులు చేయడానికి కూడా సిద్ధపడాలన్న అర్థం అందులో ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల యుద్ధంలో చొక్కాలు మడత పెట్టాలనడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల టెక్కలిలో స్థానిక ఎన్నికలు నిర్వహించిన తీరును వివరిస్తూ.. ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ తాము ఏ విదంగా పంచాయతీ ఎన్నికలు గెలిచామో వివరించారు. వ్యూహాత్మకంగా అచ్చెన్నాయుడు స్వగ్రామంలో దాడులు చేసి.. రివర్స్ లో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి.. నియోజకవర్గం అంతా భయానక వాతవరణం ఏర్పాటు చేశారు. తర్వాత టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థులపై రౌఢీషీట్లు ఓపెన్ చేసి.. ఇంట్లో నిర్బంధించి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించుకున్నారని ఆయనే చెప్పారు.
ఇక, ఇప్పుడు ఏకంగా మీడియా ప్రతినిధిపైనే దాడులు చేశారు. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. వైసీపీ వ్యూహం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అందునా ప్రశాంత ఏపీలో ఇలాంటి వ్యూహాలు మంచిది కాదని.. పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
ఒక తుక్లక్ పాలన లో ..4 త్ స్టేట్ ఆఫ్ ది నేషన్ అని పిలుచుకునే మీడియా రిపోర్టర్స్ పరిస్థితి ????????
అనంతపురం సిద్ధం సభలో శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి.
ప్రెస్ కౌన్సిల్… pic.twitter.com/uuX3sbHaRe— Swathi Reddy (@Swathireddytdp) February 18, 2024
పెత్తందారుడు జగన్ రెడ్డి పేదలపై చేసే యుద్ధం ఈ సిద్ధం సభ. బస్సుల్లేక, ట్రాఫిక్ డైవర్ట్ చేసిన సైకో జగన్పై జనాగ్రహం ఇది.#YCPAntham#ByeByeJaganIn2024 #2024JaganNoMore #AndhraPradesh pic.twitter.com/qvX71XE1Wu
— Telugu Desam Party (@JaiTDP) February 18, 2024