కూటమి ప్రభుత్వం ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో కొలువు దీరనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే.. మంత్రి వర్గం ఏర్పడనుంది. ఇక, ఎప్పటి మాదిరిగానే.. మంత్రి వర్గంలో మహిళలకు కోటా కామన్. అయితే.. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత జగన్ సర్కారు మహిళలకు ఎక్కువగానే అవకాశం ఇచ్చింది. రెండు సార్లు మంత్రి వర్గాన్ని విస్తరించిన జగన్..ప్రతిసారీ నలుగురు మహిళా నేతలకు అవకాశం ఇచ్చారు.
ఇక, ఇప్పుడు కూడా.. చంద్రబాబు నలుగురి వరకు మంత్రులుగా మహిళలను ఎంపిక చేసేందుకు అవకా శం ఉంది. అయితే.. ఇప్పుడు ఎక్కువగా అందరి నోటా వినిపిస్తున్న పేరు.. యనమల దివ్య. ఈమెకు ఖచ్చితంగా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని చెబుతున్నారు. తుని నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో పోటీ చేసి.. తొలి విజయం అందుకున్న ఈమె కు రాజకీయంగా బ్యాక్ గ్రౌండ్ ఎక్కువగానే ఉంది. యనమల రామకృష్ణుడి కుమార్తె కావడం.. ప్రదానంగా కలిసి వస్తోంది.
టీడీపీలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు.. ఈ సారి కూడా.. పోటీ నుంచితప్పుకొన్నారు. ఈ క్రమంలో రెండు సార్లు ఓడిపోయిన.. తన తమ్ముడిని పక్కన పెట్టి తొలిసారి తన కుమార్తెకు అవకాశం ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుందనే వాదన వినిపిస్తోంది. అయితే.. దివ్యకు కేవలం ఎమ్మెల్యే పదవే కాదు..మంత్రి పదవి కూడా.. దక్కుతుందని యనమల వర్గం చెబుతోంది.
మహిళా కోటాలో దివ్యకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. ఇది సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు సార్లలో ఒక్కసారి మినహా.. మిగిలిన రెండు సార్లు కూడా.. ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఆయనకు అదే పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో ఆయనకు మంత్రి వర్గంలో చోటు ఖాయం. దీంతో ఒకే కుటుంబంలోని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని.. కూడా చెబుతున్నారు. మరి ఏం చేస్తారోచూడాలి.