ఇవాల్టి రోజున ప్రపంచం మొత్తం కిందా మీదా పడిపోతున్న వైనం ఏమైనా ఉందంటే దానికి కారణం.. రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ నిర్ణయాలే. ఆయన కారణంగా వచ్చిన యుద్ధంతో రష్యా- ఉక్రెయిన్ కు పరిమితం కాక.. దాని మంటలు ప్రపంచంలోని దేశాలన్నింటిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
రోజుల్లో ముగుస్తుందన్న యుద్ధం వారాలు దాటి.. నెలల తరబడి సా..గుతున్న వైనం ఇప్పుడు రష్యాకే కాదు.. మిగిలిన ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఇక.. యుద్ధం కారణంగా దారుణంగా నష్టపోతున్న ఉక్రెయిన్ ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో పేజీలకు పేజీలు అచ్చేసిన ప్రింట్ మీడియా.. గంటల తరబడి ఆ వార్తల్నే ఇచ్చిన టీవీ చానళ్లు.. ఇప్పుడు ఆ రెండు దేశాలకు మధ్య జరుగుతున్న వార్ కు సంబంధించిన వార్తలు సింగిల్ లేదంటే డబుల్ కాలమ్ కు పరిమితమవుతున్నాయి.
ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే ప్రాధామ్యాల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సా..గుతున్న యుద్ధం వేళ.. రష్యా మీడియా సంస్థలు ఇప్పుడు ఒక హాట్ట వార్తను ప్రపంచానికి చాటి చెప్పి సర్ ప్రైజ్ చేశాయి.
పేరుకు రష్యాకు అధ్యక్షుడిగా చెప్పుకునే పుతిన్.. వాస్తవానికి అసలుసిసలు నియంతన్న సంగతి తెలిసిందే. చట్టాల్ని మార్చి మరీ.. తాను కూర్చున్న అధ్యక్ష కుర్చీలోకి మరెవరూ కూర్చోకుండా చేసిన ఆయన.. అధికారాన్ని చెలాయించటంలోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ దూసుకెళుతున్నాడు. తాను తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుతిన్.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒక డెవలప్ మెంట్ సాధిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఆయన తన 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కానున్న వైనం బయటకు వచ్చింది. ఇంతటి సంచలన విషయాన్ని రష్యా మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు రావటం గమనార్హం. 39 ఏళ్ల పుతిన్ ప్రేయసి కమ్ మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయోవాకు ఆడపిల్ల పుట్టనుందన్న వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ఆమెకు పుతిన్ కారణంగా ఇద్దరు కొడుకులు.. మరో ఇద్దరు కవలల కుమార్తెలు ఉన్నట్లు చెబుతారు. వారికి సంబంధించిన వివరాలు బయటకు రావొద్దనే ఉద్దేశంతో రహస్యంగా ఉంచినట్లుగా చెబుతారు.
తన వ్యక్తిగత వివరాలు బయటకు వచ్చేందుకు ఏ మాత్రం అవకాశం లేని రీతిలో పుతిన్ చర్యలు ఉంటాయని చెబుతారు. ప్రస్తుతం ప్రేయసిని తల్లిని చేసిన పుతిన్ కు మాజీ భార్య లియుద్ మిలాతో కలిసి ఇద్దరు కుమార్తెల్ని కన్నారు. వారిలో ఒకరు వ్యాపారవేత్తగా.. మరొకరు శాస్త్రవేత్తగా మంచి పేరుంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే పుతిన్ పెద్ద కుమార్తె వయసు ఉన్న అలీనాతో ఇప్పుడాయన ప్రేమాయాణం సాగిస్తున్న వైనం గమనార్హం. వీరే కాక.. పుతిన్ కు మరో మహిళతోనూ వివాహేతర సంబంధం ఉందన్న వార్తలు వస్తుంటాయి. ఏమైనా.. వయసు మీద పడుతున్నా.. రసికత్వం మాత్రం ఎంతకూ తగ్గలేదన్న విషయం తాజా వార్తలతో స్పష్టమవుతున్నాయని చెప్పక తప్పదు.