• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నితిన్‌పై అమ్మ రాజశేఖర్ ఫైర్

NA bureau by NA bureau
July 11, 2022
in Movies, Top Stories, Trending
0
0
SHARES
166
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు. తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపుగా వివాదాలేవీ లేవనే చెప్పాలి. కానీ అతడి మీద ఇప్పుడు దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కొంచెం తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశాడు.

‘రణం’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్.. ఆ తర్వాత నితిన్‌తో ‘టక్కరి’ అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా ‘హై ఫైవ్’ అనే సినిమా తీశాడు. దీనికి నిర్మాత కూడా అతనే.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు వస్తానని మాట ఇచ్చిన నితిన్.. ఉద్దేశపూర్వకంగా రాలేదంటూ అమ్మ రాజశేఖర్ విమర్శలు గుప్పించాడు. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్లో తిరుగుతోంది. ఇంతకీ అమ్మ రాజశేఖర్ ఏమన్నాడంటే..

‘‘నితిన్‌ను ఈ ఫంక్షన్‌కి పది రోజుల ముందే పిలిచాను. వస్తానని చెప్పాడు. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. వాడికి కెరీర్ ఆరంభం నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఉండి అన్నీ నేర్పించి ఒక గురువుగా ఉన్నాను నేను. నా ఫంక్షన్‌కి అతను కచ్చితంగా వస్తాడని నమ్మి నేను ఒక ఏవీ కూడా రెడీ చేయించాను. కానీ నితిన్ ఈ ఫంక్షన్‌కి రాలేదు.

అతను రాకపోడానికి కారణం షూటింగ్ ఉండి కాదు. అతను ఇంట్లోనే ఉన్నాడు. తనకు జ్వరం అని చెప్పాడు. కానీ అది నిజం కాదు. కనీసం బైట్ ఇవ్వమని అంటే అది కూడా ఇవ్వలేదు. లైఫ్‌లో ఎవరైనా ఒక స్థాయికి ఎదిగాక దానికి కారణం ఎవరో వాళ్లను మరిచిపోకూడదు. ఒక స్థాయికి వచ్చాక నువ్వు రాలేనంటే రాలేనని చెప్పా.

వస్తా అని చెప్పి రాకుండా ఉంటే నన్ను అవమానించినట్లే. నితిన్.. నేను చాలా అప్సెట్ అయ్యాను. నిన్ను నేను చాలా నమ్మాను. కానీ ఇంట్లో ఉండి కూడా నువ్వు రాలేదు. నేను అప్పెట్ అయ్యాను. మనం లైఫ్‌లో చూస్తాం. మనం కలుస్తాం’’ అని అమ్మ రాజశేఖర్ అన్నాడు. మరి ఈ విమర్శలు, ఆరోపణలపై నితిన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Tags: amma rajasekharnithinTollywood
Previous Post

మంచు విష్ణు కాన్ఫిడెన్సే వేరబ్బా

Next Post

69 ఏళ్ల వయసులో తండ్రి కానున్న ప్రపంచంలోనే పవర్ ఫుల్ నేత

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Load More
Next Post
vladimir putin

69 ఏళ్ల వయసులో తండ్రి కానున్న ప్రపంచంలోనే పవర్ ఫుల్ నేత

Please login to join discussion

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra