కోవిడ్ కాదు కానీ ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసేస్తోంది. మందూమంచింగ్ మధ్య ఆఫీసు పని చేసుకోవడం… బెడ్రూం నుంచే బాస్‌తో మీటింగ్ అటెండ్ కావడం… ఒకటేమిటి.. ఇండియాలో అస్సలు ఊహించనవన్నీ ఓకే చేసింది కోవిడ్.
కోవిడ్ దెబ్బకు ఆఫీసులకు రాకండయ్యా ఇంటి నుంచే పని చేసుకోండంటూ వర్క్ ఫ్రం హోం ఆఫర్లిస్తే… దాన్ని వర్క్ ఫ్రం రిసార్ట్స్.. వర్క్ ఫ్రం గెస్ట్ హౌస్, వర్క్ ఫ్రం పంప్ హౌస్.. వర్క్ ఫ్రం బెడ్ రూం, వర్క్ ఫ్రం లాడ్జ్… వర్క్ ఫ్రం రిమోట్ ప్లేస్, అన్ నోన్ ప్లేస్… ఒకటేమిటి అన్ని రకాలుగా మార్చేసి ఇప్పుడు ఏపీలో అయితే ‘వర్క్ ఫ్రం పందెం బరి’ అంటున్నారు.
అవును… కోర్టులు, స్టేలు, కోవిడ్, ఒమిక్రాన్‌లు ఉన్నా కానీ గోదావరి జిల్లాల్లో మాత్రం సంక్రాంతికి పందెం బరులు రెడీ అయిపోతున్నాయి.
మామూలుగా అయితే, పండక్కీపబ్బానికీ సెలవులు దొరకని వారంతా థర్డ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ వర్క్ ఫ్రం హోం వచ్చేసి ఈసారి సొంతూళ్లలో సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సిద్ధమైపోయారు.
గోదారి జిల్లాల్లో సొంతూర్లో ఉండి.. అదీ సంక్రాంతికి ఇంట్లో కూర్చుని పనిచేసుకుంటామంటే ఊళ్లోని ఫ్రెండ్స్ ఊరుకుంటారేంటి.. లుంగీలు ఎగ్గొట్టుకుని ఈడ్చుకెళిపోరూ. అదే మరి ఇప్పుడు జరుగుతోంది.
‘పదరా పందెం బరి కాడికెళ్లొద్దాం’ అంటూ సాఫ్ట్వేర్ బాబులను సొంతూరి ఫ్రెండ్స్ ఈడ్చుకెళిపోతున్నారట. దీంతో సాఫ్ట్వేర్ కుర్రాళ్లు చేతిలో ల్యాప్‌టాప్, చెవికి బ్లూటూత్ పెట్టేసుకుని తోటల్లోకి చేరిపోతున్నారు.
అక్కడే ఆఫీసు పని, అన్ని పనులూనట.
ఇంకోమాట… సాఫ్ట్వేర్కి వెళ్లినా లోపలి గోదారి హార్డ్ వేర్ ఏమాత్రం మారని కుర్రాళ్లు కొందరు పందెం కోళ్లు పెంచి మాంచి డబ్బులు కూడా సంపాదించేస్తున్నారట.
ముందుచూపుతో వాళ్లు ఆరేడు నెలల కిందట నుంచే పందెంకోళ్ల పెంపకం మొదలుపెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించేస్తున్నారంటే నమ్మండి.
అసలే సాఫ్ట్‌వేరోళ్లు కదండీ కోడిపందేలను ఆన్‌లైన్‌లోకీ తెచ్చేస్తున్నట్లు వినికిడి. ఇలాంటి పందెం అవకాశాలు లేని తమ సాఫ్ట్ వేర్ మిత్రుల కోసం వాట్సాప్ గ్రూపులు, లైవ్‌లు పెట్టి ఎక్కడ ఉన్నా తమ ఊళ్లో నచ్చిన కోడి మీద పందెం కూడా చాన్స్ కూడా ఇస్తామంటున్నారట.
చూడాలి… సంక్రాంతికి అసలు ఏం జరగబోతోందో.
Gallery: సిగ్గు… బట్టలు… రెండూ వదిలేసింది
తెలుగు యాంకర్ బట్టలిప్పడం మొదలుపెట్టిందే
Samantha : ఈ ఫొటోలు సమంతవి ఎందుకు వైరల్ అవుతున్నాయి?