పులివెందుల, నాడు వైఎస్, ఆ తర్వాత జగన్ అఖండ మెజారిటీతో గెలుస్తున్న చోటు. అక్కడంతా అద్భుతంగా ఉన్నట్టు ప్రచారం చేస్తుంటారు. నేతలను మేపడానికి నిధులు కేటాయించి ఎపుడూ ఏదో ఒకటి కట్టిస్తుండటం తప్ప మిగతా ఏ విషయంలో మార్పులేదు అక్కడ. విభజిత రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పులివెందులకు నీళ్లు ఇచ్చాడు. అంతకుముందు ఓటేసిన ప్రజలకు అసలు నీళ్లు కూడా ఇవ్వని ఘనత వైఎస్ ది, జగన్ ది.
అయితే, ఇపుడు వారి సొంత నియోజకవర్గంలో ఒక మహిళ రేప్ కు గురైందన్న సంచలన వియాషాన్ని తెలుగుదేశం నేత నారా లోకేష్ వెల్లడించారు. ఇది సంచలన విషయం ఎందుకంటే… ఆ రేప్ బయటకు రాకుండా దాచిపెట్టారట. ఈ విషయం లోకేషే చెప్పారు.
‘జగన్ సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు.’ అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది.ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ద మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి’’ అంటూ లోకేష్ డిమాండ్ చేశారు. వెంటనే విచారణ జరిపించిన నాగమ్మను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని జగన్ ని డిమాండ్ చేశారు లోకేష్.