వైసీపీ యువ నాయకురాలు, బీసీ నేత మురుగుడు లావణ్య కు మంగళగిరిలో కొందరు మహిళలు షాకిచ్చా రు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీకి దిగిన రాజకీయ కుటుంబానికి చెందిన లావ ణ్య.. ఆదివారం గడపగడపకు తిరిగారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ.. తనకు ఓటేయాలని అభ్యర్థించా రు. అయితే.. కొందరు మహిళలు సానుకూలంగా స్పందించినా.. మరికొన్న చోట్ల మాత్రం వ్యతిరేకత వచ్చింది. తాము నారా లోకేష్కే ఓటేస్తామని మొహం మీదే చెప్పేశారు.
దీంతో వైసీపీ అభ్యర్థి లావణ్య షాకయ్యారు. అప్పటి వరకు నవ్వుతూ వున్న ఆమె ముఖం కళావిహీనంగా మారిపోయింది. అయితే..ఇలా అన్నవారితో ఎలాంటి వాదన పెట్టుకోకుండా.. ఆలోచించండమ్మా! అంటూ.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. మరోవైపు.. లావణ్య మాతృమూర్తి, రెండు సార్ల గెలిచిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, లావణ్య మామగారు.. రెండు సార్లు గెలిచిన మురుగుడు హనుమంతరావు కూడా విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రచారం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..
ప్రచారంలో భాగంగా మురుగుడు లావణ్య ఆదివారం ఉదయం మంగళగిరిలోని దుగ్గిరాల మండలంలో ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఓ ఇంటికి వెళ్లిన లావణ్య అక్కడి మహిళను తనకు ఓటేసి గెలిపించా లని కోరారు. అయితే.. తమకు నేతన్న నేస్తం నిధులు రెండు దఫాలుగా రాలేదని.. అనేక సార్లు అర్జీలు పెట్టినా.. ఇస్తామని ఇవ్వలేదని చెప్పారు. దీంతో లావణ్య స్పందిస్తూ.. నాకు ఓటేసి గెలిపించండి..నేను మీకు అందుబాటులోనే ఉంటాను. సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.
దీనికి ఆ పెద్దావిడ.. స్పందిస్తూ.. ఆ అవసరంలేదు.. మేం లోకేష్కే ఓటేస్తాం.. ఆయనపైనే నమ్మకం ఉంది.. అని మొహంమీదే చెప్పేశారు. దీంతో లావన్య ముఖం చిన్న బోయింది. ఆలోచించమ్మా! అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. నియోజకవర్గం అంతా ఇలానే ఉందనికాదు.. కొన్ని చోట్ల మాత్రం వైసీపీకి సహజంగానే వ్యతిరేకత వస్తోంది.