సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి, మన తెలుగు వారు.. జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగ న్.. గత ఏడాది సుప్రీం సీజే బోబ్డేకు లేఖ రాయడం.. అనంతరం దానిని మీడియాకు లీక్ చేయడం తెలిసిం దే. ఈ క్రమంలో జగన్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. అయితే.. వీటిని తాజాగా సుప్రీం కకోర్టు అంతర్గత విచా రణ చేపట్టి…(దీనిని బహిర్గతం చేయలేమని స్పష్టం చేసింది) సీఎం జగన్ చేసిన ఆరోపణలు `నిరాధారం` అని స్పష్టం చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా… ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు మిగిలాయి.
న్యాయ వర్గాల ప్రశ్నల పరంపర!
+ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి.. ఇలా తప్పుడు లేదా నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చా?
+ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోనే ఇన్ని నిరాధారమైన అంశాలను పేర్కొన్నారంటే.. చట్టంపైన, న్యాయంపైనా ఆయనకు ఏమేరకు విశ్వసనీయత ఉంది?
+ ఇక, రాజధాని అంశంపై ఏకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిపైనే తప్పుడు ఫిర్యాదు చేయడం సమంజసమేనా?
+ తన నిరాధార.. తప్పుడు ఫిర్యాదులతో సుప్రీం కోర్టును ఓ రాజకీయ వేదిక చేయాలని జగన్ భావించలేదా?
+ న్యాయ వ్యవస్థకు మకిలి అంటించి.. తన పబ్బం గడుపుకోవాలని సీఎం స్థాయిలో జగన్ ప్రయత్నించలేదా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.
మేధావుల వాదన ఇదీ!!
+ ఇంత నిరాధారమైన ఆరోపణలు చేసిన సీఎంజగన్ పై చర్యలు ఉండాలి కదా?
+ చిన్న చిన్న కేసుల్లోనే కక్షిదారులు తప్పుడు ఆరోపణలు చేసినా.. కోర్టు సమయాన్ని వృథా చేసినా.. న్యాయమూర్తులు చర్యలు తీసుకుంటున్నారు.
+ ఇక, తప్పుదోవ పట్టించే ఫిర్యాదులపై భారీ ఎత్తున జరిమానాలు, శిక్షలు కూడా వేస్తున్నారు.
+ ఒక రాష్ట్రానికి కకీలకమైన సీఎంగా ఉన్న జగన్ .. ఇదే పంథాను అనుసరిస్తే.. చర్యలు లేవా?
+ సుప్రీం కోర్టునే తప్పుదారి పట్టించేందుకు, సీనియర్ న్యాయమూర్తి పైనే తప్పుడు, నిరాధార ఆరోపణలతో పరువు తీసేందుకు ప్రయత్నించిన జగన్పై ఎలాంటి చర్యలూ తీసుకోరా?
+ ఈ రోజు జగన్ వ్యవహారం.. రేపు మరొకరు చేయరని గ్యారెంటీ ఏమైనా ఉందా? మరో న్యాయమూర్తిపై.. మరో సీఎం ఇలానే `బరితెగిస్తే`.. ఏం చేయాలి?
+ తప్పుడు, నిరాధార ఆరోపణలతో నిజాయితీపరులైన న్యాయమూర్తులను రోడ్డున పడేయాలనుకునేవారికి బుద్ధి చెప్పేలా.. జగన్ ఉదంతంలో సుప్రీం కోర్టు ` న్యాయం`చేయాలి!
+ భవిష్యత్తులో ఇలాంటి సీఎంల దూకుడుకు.. జగన్ విధించే శిక్ష గుణపాఠంగా చరిత్రలో నిలిచిపోవాలి
+ ఆ దిశగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తన హయాంలోననే చర్యలు తీసుకుని.. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని పరిరక్షించాలి.