తానొకటి తలిస్తే… తన మిత్రపక్షం బీజేపీ నాయకులు మరొకటి తలిచారన్నట్టుగా.. ఉంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి.
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి.. ఆది నుంచి ఆశ పెట్టుకున్న పవన్‌కు బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం.. ఈ టికెట్‌ను వారే సొంతం చేసుకోవడం తెలిసిందే.
అయితే.. టికెట్ సంపాయించుకున్నంత ఈజీగా.. గెలుపు విషయంలో కమల నాథులు ధైర్యంగా ఉండలేక పోతుండడం గమనార్హం.
దీంతో ఇప్పుడు ప్రచారపర్వంలోకి పవన్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై పవన్‌తో చర్చలు కూడా నడుస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా.. బీజేపీ తరఫున ఉప ఎన్నికలో ప్రచారం చేస్తే… పవన్ బలవుతారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
బీజేపీ తరఫున ప్రచారం చేసినా.. ఆ పార్టీ అభ్యర్థి కనుక ఓడిపోతే.. ఈ ప్రభావం ఖచ్చితంగా పవన్‌పై పడుతుంది. పవన్ ప్రచారానికి కూడా ప్రజలు స్పందించలేదని, పవన్ హవా పోయిందని కామెంట్లు రావడం ఖాయం.
ఒకవేళ.. పవన్ ప్రచారం చేసి.. గెలిపిస్తే.. ఈ క్రెడిట్‌ను బీజేపీ నేతలు పవన్ ఖాతాలో వేస్తారా? అనేది కూడా సందేహమే. ఎందుకంటే.. పవన్ ప్రచారం ఏముంది.. అంతా కేంద్రం చేస్తున్న అభివృద్ధితోనే గెలిచాం అని ఎక్కడో ఒక చోట చెప్పే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు.. ఈ రెండు విషయాలను పక్కన పెడితే.. బీజేపీపై గుర్రుగా ఉన్న పవన్.. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీతో ఎలాగూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం చేసి ప్రయోజనం ఏంటనేది కూడా ప్రశ్నగానే ఉంది.
పైగా ఇప్పుడు ఏపీలో బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీకి ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు పవన్ చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ఈ దిశగానే జనసేన నేతలు ఆలోచిస్తున్నారు. దీంతో దిగువ స్థాయి కేడర్ పార్టీలో చొరవ చూపించే పరిస్థితి లేదని.. ఏదో పవన్ వచ్చినా.. కొంత మేరకు మాత్రమే కేడర్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీనికి బీజేపీ నేతలు అనుసరిస్తున్న వైఖరే కారణమని అంటున్నారు పరిశీలకులు.
అంటే.. తిరుపతిని సాకుగా చూపి.. పవన్ ఇమేజ్‌తో గేమ్ ఆడుకునే అవకాశం కూడా లేకపోలేదని బీజేపీ నేతలను నిశితంగా గమనిస్తున్న వారు చెబుతుండడం గమనార్హం.
మొత్తంగా చూస్తే… తిరుపతి పోరు.. బీజేపీకి ప్రాణసంకటంగా మారిందనడంలో సందేహం లేదు.
ఇదే సమయంలో తాను మునగడంతోపాటు.. మిత్రపక్షాన్ని కూడా ముంచడం ఖాయమని అంటున్నారు.