ఏపీలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ద్వారా రికార్డు సృష్టించాలని వైసీపీ భావిస్తోంది. అయితే.. ఇది ఇప్పుడు ఉన్నంత తేలిక అయితే.. కాదని అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగోలేదని చెబుతు న్నారు. నాయకులు.. ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అభివృద్ధి లేకపోవడం ఒక కారణమైతే.. వలంటీర్ల వ్యవస్థ మరోకారణంగా మారిందని చెబుతున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు అక్కడే టికెట్లు ఇస్తే.. గెలుపు కష్టమనే భావన పార్టీ వర్గాల్లో వినిపిస్తోం ది. ప్రస్తుతం 151 స్థానాల్లో దాదాపు 60 స్థానాల్లో మార్పులు చేయాలని..ఐప్యాక్ సర్వే తేల్చి చెప్పినట్టు ఇటీవ ల వైసీపీ వర్గాల నుంచి లీకులు బయటకు వచ్చాయి. దీనిలో పార్టీ అధినేత జగన్ 50 వరకు మార్పులు చేర్పులు చేసేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. కానీ ఇంత భారీ మార్పులు చేసినా..రెబల్స్ గా మారి తే.. పరిస్థితి దిగజారడం ఖాయమని భావిస్తున్నారు.
ఈ క్రమంలో కొందరిని పార్టీలో కీలక బాధ్యతలకు వినియోగించుకుని.. మరికొందరిని వేర్వేరు నియోజకవ ర్గాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు తాడేపల్లి వర్గాల మాట. అంటే.. ఎక్కడైతే.. ఎమ్మెల్యేలు, మంత్రుల పై గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయో.. ఎక్కడ వ్యతిరేకత పెల్లుబుకుతోందో.. అక్కడ ఆయా నాయకుల ను మార్చి.. వేరేవారిని నియమించడంతోపాటు.. సిట్టింగులకు స్థాన చలనం కలిగించాలనేది అధినేత ఆలో చనగా ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే.. ఈ విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా.. గత ఎన్నికల్లో అధికార పక్షంగా ఉన్న టీడీపీ చేసిన ఇలాంటి ప్రయోగాలు వికటించాయి. అప్పటి మంత్రి జవహర్‌ను కొవ్వూరుకు బదులుగా.. తిరువూరు నుంచి పోటీ చేయించారు. అదేవిధంగా అప్పటి పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించారు. ఇలా.. రాష్ట్రంలో సుమారు 10 నియోజవర్గాల్లో మార్పులు చేశారు. అయితే.. వారంతా కూడా ఓటమి పాలయ్యారు.
కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఈ పరిణామాలను గుర్తు చేసుకుంటున్న వైసీపీ నాయకులు ఇప్పుడు తమను మార్చడం జరిగితే.. ఇదే ఫలితం వస్తుందేమో.. అనే బెంగ పట్టుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు.. మరో వ్యూహం ఏదైనా ఆలోచన చేయాలనేది పార్టీ నేతల సూచన. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.