టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య, సమంతలు విడిపోయి చాలాకాలమైనప్పటికీ..వారిద్దరికీ ఆ విడాకుల ఎపిసోడ్ పై ప్రశ్నలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న సమంతను కరణ్ ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి గుచ్చి గుచ్చి అడిగాడు. అన్ హ్యాపీ మ్యారేజెస్ కి కరణ్ జొహరే కారణమని సమంత కూడా పంచ్ వేసింది. కరణ్ తన సినిమాల్లో వైవాహిక జీవితాన్ని కభీ ఖుషీ కభీ గమ్ లో లాగా చాలా అందంగా ఉంటుందని చూపిస్తాడని, కానీ, వాస్తవానికి వైవాహిక జీవితం కేజీఎఫ్ లా ఉంటుందని సెటైర్ వేసింది.
ఇఖ, నాగ చైతన్యతో ఒకే గదిలో ఏకాంతంగా ఉంటే ఏం చేస్తారు? అంటూ సమంతను కరణ్ ఓ ప్రశ్న వేశాడు. అయితే, ఆ గదిలో పదునైన ఆయుధాలు లేకుండా చూడాలంటూ సామ్ చెప్పింది. అంటే, తమ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందన్న అర్థం వచ్చేలా సమంత సమాధానిమిచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, తన తాజా చిత్రం లాల్ సింగ్ చద్ధా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చైతూకు కూడా దాదాపుగా ఇటువంటి ప్రశ్నే ఎదురైంది. కానీ, సమంతలా కాకుండా నాగచైతన్య ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇపుడు వైరల్ అయింది. ఆ ప్రశ్నకు చైతూ ఇచ్చిన ఆన్సర్త సమంత అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.
సమంత ఎదురుపడితే, ఆమెను కలవాల్సి వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న చైతూకు ఎదురైంది. సామ్ కనిపిస్తే హాయ్ చెప్పి, హగ్ చేసుకుంటానని చైతూ చాలా కూల్ గా సమాధానమివ్వడం చర్చనీయాంశమైంది. మొదటి నుంచి కూడా తన విడాకుల విషయంలో చైతూ ఎక్కడా కాంట్రవర్సీలకు తావివ్వకుండా మాట్లాడాడు. తాజాగా కూడా సామ్ లా కాకుండా…ఇలా మెచ్యూర్డ్ గా సమాధానమిచ్చిన చైతూపై సామ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.