అమెరికా నూతన అధ్యక్షుడిగా మరో 17 రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న రిపబ్లికన్ పార్టీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్ కు జైలు శిక్ష పడనుంది. అమెరికా శృంగార తారతో ఆయన కొన్నేళ్ల కిందట జరిపిన రాసలీలలు.. అనంతరం ఆమెకు సొమ్ములు ముట్టజెప్పడం తెలిసిందే. దీనిపై ఎన్నికలకు ముందు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యూయార్క్ న్యాయస్థానం తాజాగా తీర్పును కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు నిరూపితమైందని.. ట్రంప్ దోషేనని తేలిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
దీనికిగాను ట్రంప్ నకు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. వాస్తవా నికి ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష సుమారు 10 ఏళ్లకు తగ్గకుండా ఉంటుంది. జరిమానా కూడా రూ.కోట్లలోనే చెల్లించాల్సి ఉంది. అయితే.. ఎన్నాళ్లు జైలు, ఎంత జరిమానా అనే విషయాన్ని న్యాయమూర్తి వెల్లడించ లేదు. త్వరలోనే దీనిపై తీర్పు ఇస్తానని చెప్పారు. దీనిని బట్టి ఈ నెల 10న న్యాయ మూర్తి తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఇది రాజకీయంగానే కాకుండా.. ఎన్నికైన అధ్యక్షుడిగా ట్రంప్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చింది.
అయితే.. ఈ సందర్భంగానే న్యాయమూర్తి మరో కీలక వ్యాఖ్య చేశారు. తాను విధించే జైలు శిక్షను ట్రంప్ అనుభవించాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన నిరభ్యంతరంగా అధ్యక్ష భవనంలోకి నూతన అధ్యక్షుడిగా అడుగు పెట్టవచ్చని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు కూడా ఇస్తామన్నారు. కాగా.. ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ పదవి స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయన తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అయితే.. తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ జైలుకు వెళ్లకపోయినా.. జరిమానా కట్టక పోయి నా.. ఒక అధ్యక్షుడిపై ఇలా కేసు నిరూపితం కావడం.. జైలు, జరిమానా శిక్షలు పడడం వంటివి మాత్రం ఆయనకు మరకలు పడేలా చేస్తున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిపై ఇప్పటి వరకు కేసులు లేవని.. ఇప్పుడు ట్రంప్ విషయంలో ఈ రెండు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆయన జైలుకు వెళ్లకపోయినా.. జరిమానా కట్టకపోయినా కూడా.. భవిష్యత్తులో ఈ అభియోగాలు మాత్రం ఆయనను వెంటాడుతుంటాయని చెబుతున్నారు.