నీతులు వల్లించటం ఎవరైనా చేసేదే. పెద్ద పదవుల్లో ఉన్న వేళలో.. అవకాశం లభిస్తే చాలు నాన్ స్టాప్ గా నీతి సూత్రాల్ని వల్లించటం చూస్తుంటాం. మరి.. తమ మంత్రివర్గంలోని మంత్రి అనుచరుడు రచ్చ రచ్చ చేస్తే.. దానిపై చర్యలేంటి? అన్నది ఏపీ ముఖ్యమంత్రికి.. ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలోని కియా పరిశ్రమకు దగ్గరగా విలువైన భూమిని ఆక్రమించేందుకు ఏపీ మంత్రి సత్య కుమార్ అనుచరుడి అరాచకం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
ఏపీ మంత్రి సత్యకుమార్ కు ఉన్న ముఖ్య అనుచరుల్లో ఒకరు ఆదినారాయణ యాదవ్. రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతుంటారు. ఇతడు కియా పరిశ్రమకు సమీపంలోని భూమికి సంబంధించిన ప్రహరీని ధ్వంసం చేయటమేన కాదు.. అతడి అనుచరులు క్రియేట్ చేసిన అరాచకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరి అరచకాన్ని ప్రశ్నించిన భూమి యజమానిపై దాడికి పాల్పడటమే కాదు.. బెదిరింపులకు దిగారు.
కియా పరిశ్రమకు సమీపంలోని మునిమడుగు గ్రామంలోని సర్వే నెంబరు 433లో 1.72 ఎకరాల భూమి ఉంది. దీన్ని చండీగఢ్ కు చెందిన హరిజిత్ సింగ్ నుంచి గుంతకల్లుకు చెందిన ప్రభాకర్ కొన్నారు. ఈ భూమికి పక్కనే ముదిగుబ్బ మండల అధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న గ్లోబల్ హార్టీకల్చర్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన భూములు ఉన్నాయి.
దీనికి యజమాని మరెవరో కాదు.. వైసీపీ నుంచి ఎంపీపీగా ఎన్నికై.. ఎన్నికల వేళ బీజేపీలో చేరాడు ఆదినారాయణ. అతడు మంత్రి సత్యకుమార్ కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం ఆదినారాయణ కారులో కొందరు వచ్చి.. ప్రభాకర్ కు చెందిన భూమి వద్ద బీభత్సన్ని క్రియేట్ చేశారు. తాను చెప్పినట్లు చేయకుంటే చంపేస్తానని వార్నింగ్ ఇవ్వటమే కాదు.. భౌతికంగా దాడులకు పాల్పడ్డారు.
ఇదంతా చూస్తున్న అక్కడి పొలాల్లో పని చేసే రైతులు కేకలు వేయటంతో ప్రభాకర్ ను విడిచి పెట్టి పారిపోయారు. అక్కడే తాము తీసుకొచ్చిన ప్రొక్లెయిన్.. కారును వదిలేసి పారిపోయారు. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకొని కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. మంత్రి ముఖ్య అనుచరుడి మీద కఠిన చర్యలు తీసుకోకుంటే నీతిసూత్రాల్ని వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు.