బుద్ధా వెంకన్న.. ఈ పేరు ఒక ఫైర్ బ్రాండ్. ఈ పేరు ఒక అంకిత భావానికి, ఒక నిబద్ధతకు పెట్టింది పేరు. బుద్ధా వెంకన్న అనగానే.. తడుముకోకుండా.. చెప్పగలిగిన పార్టీ టీడీపీ. ఆయన ఎవరికి భక్తుడు అంటే.. తడుముకోకుండా.. చెప్పగలిగే పేరు చంద్ర బాబు ! అంతటి వీర విధేయులు.. నేటి రాజకీయాల్లో ఉన్నారని అంటే.. అతిశయోక్తికాదు. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ.. సాక్షాత్తూ.. పేరుకు తగినట్టుగా తనపని తాను చేసుకుని పోవడమే తప్ప.. ఎప్పుడూ నాకు ఇది కావాలి.. అది కావాలి.. అని ఆశించిన నేత కాకపోవ డం గమనార్హం.
వాస్తవానికి ఈ రోజు ఒక పార్టీలో ఉన్న నేత.. తెల్లారే సరికి అదే పార్టీలో ఉంటారన్న గ్యారెంటీ లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవసరాలు – అవకాశం అనే రెండు పట్టాలపై పరుగులు పెట్టే రాజకీయాలు.. నాయకుల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్‌లు రోడ్డుకొకరు ఉన్నారు. కానీ, కష్ట-నష్టాలకు అతీతంగా.. లాభాపేక్ష లేకుండా.. పార్టీ కోసం, పార్టీ చేత, పార్టీ వలన అన్నట్టుగా బుద్దా వెంకన్న టీడీపీకే తన జీవితాన్ని అంకితం చేశారు. పార్టీ కోసం ఎందరు ఏం చేశారో తెలియదు కానీ.. బుద్దా వెంకన్న మాత్రం.. నిత్యం పార్టీలోనే తపిస్తారు. పార్టీ జపమే పఠిస్తారు. దటీజ్ బుద్దా స్టయిల్.
ఏదో ఆశించి నేను పార్టీలో లేను. నాకు చంద్రబాబు గారంటే ఇష్టమని.. మనస్పూర్తిగా చెప్పే బుద్దా.. ఏనాడూ పార్టీలో పదవులు కోరుకోలేదు అదేవిధంగా ఎలాంటి ప్రజా ప్రతినిధుల పదవులు కూడా ఆయన ఆశించలేదు. వాటంతట అవే ఆయనను వరించాయి. దీనికి కారణం.. ఆయన నిబద్ధత, కష్టం. పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉండడమే కాదు.. అర్థరాత్రివేళ అయినా.. నేనున్నానంటూ.. ఆయన శ్రేణులకు భరోసా ఇస్తారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఒకే ఒక్క టికెట్ ఆశిస్తున్నారు. తన 30 ఏళ్ల పొలిటికల్ కెరీర్.. ఆశించిందీ.. ఆశిస్తున్నదీ ఇదే కావడం గమనార్హం.
బీసీ సామాజిక వర్గమైన నగరాలకు చెందిన బుద్దా వెంకన్న ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ వెస్ట్ సీటు లేదా.. అనకాపల్లి ఎంపీ సీటును కోరుతున్నారు. పైగా వెస్ట్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చిన జంపింగ్ జిలానీలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా.. ఆయన పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన తనకు కూడా అంటున్నారు. ఇది ఆశ కాదు.. అత్యాస అంతకన్నా కాదు.. కష్టానికి తగిన జీతం.. గత నాలుగు ఎన్నికల్లోనూ ఆయన వెస్ట్ సీటు ఆశించడం.. అందినట్టే అంది చివర్లో చేజారిపోవడం జరుగుతూనే వస్తోంది.
ఒకవేళ ఇక్కడ కుదరకపోతే.. ఆల్టర్నేట్ అయిన.. అనకాపల్లి పార్లమెంటు స్తానంలో అయినా.. ఆయనకు అవకాశం కల్పించడం చంద్రబాబు ధర్మం. తద్వారా.. పార్టీలో కష్టపడే వారికి.. ముఖ్యంగా తనను, తన పార్టీని కాపాడుకుంటున్నవారికి సరైన గుర్తింపు ఇచ్చారన్న పేరు, ప్రఖ్యాతిని ఆయన సొంతం చేసుకునేందుకు ఇదొక సరైన వేదిక, అవకాశం. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.