విజయనగరం నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక సార్లు ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. టీడీపికి చెందిన అశోక్ గజపతిరాజు అనేక సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి అరంగేట్రం చేసిన అశోక్ గజపతిరాజు ఇక్కడ విజయం సాధించారు. 1983లో ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ టికట్‌పై అశోక్ గజపతిరాజు మరోసారి విజయం సాధించారు.
1985, 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి బరిలోకి దిగిన అశోక్ గజపతిరాజు విజయం సాధించారు. 1994లో ఐదోసారి విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆరోసారి వరుసగా విజయాన్ని దక్కించుకున్నారు. అయితే, 2004లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అశోక్ గజతిపరాజు ఓటమి చవి చూశారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెం ట్‌గా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి(ప్రస్తుత డిప్యూటీ స్పీకర్) విజయాన్ని దక్కించుకున్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం రాజును చంద్రబాబు పార్లమెంటుకు పంపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఇక, 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అశోక్ కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతిరాజు టీడీపీ తరఫున పోటీ చేశారు.
ఈ సారి గెలుపు పక్కా…
విజయనగరం అసెంబ్లీ స్థానం విజయనగరం రాజుల అడ్డాగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. గడిచిన ఎన్నికల్లో తన కుమార్తె అదితిని ఈ స్థానం నుంచి బరిలోకి దింపారు. అయితే, అనూ హ్యంగా ఆమె తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికలకు సంబంధించి తాజాగా.. ప్రక టించిన జాబితాలో అదితికి చోటు దక్కింది. దీంతో అశోక్‌ను విజయనగరంఎంపీ స్థానానికి పంపించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదెలా ఉన్నప్పటికీ.. ఈ సారి అదితి విజయం దక్కించుకో వడం పక్కా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమెపై గత ఎన్నికల్లో ఓటమి తాలూకు సానుభూతి, ఈ కుటుంబంపై సర్కారు వారి వేధింపులు వంటివి ఆమెకు ప్లస్ అవుతాయని అంటున్నారు పరిశీలకులు. దీనికి తోడు కేడర్‌లోనూ ఉత్సాహం పెరిగింది. దీంతో అదితి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు.