ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. చివరకు ఏపీ సర్కారు విద్యుత్ కోతలు పెరుగుతాయి అని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు జాగ్రత్త పడి ప్రత్యామ్నాయాలు ఏర్పాటుచేసుకోవడం, అధిక బొగ్గు నిల్వలు పెట్టుకోవడం చేశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం విద్యుత్ లోటును తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఏపీలో విద్యుత్ కోతలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మొత్తం రూ.36 వేల కోట్ల భారం మోపారని టిడిపి అధినేత చంద్రబాబు జగన్ సర్కారును విమర్శించారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక విద్యుత్ ఛార్జీలు ఉన్నది ఏపీలో మాత్రమే అని చంద్రబాబు వివరించారు.
డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయిస్తే
బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 పెట్టి విద్యుత్ కొనడం ప్రభుత్వ అసమర్థత అన్నారు. మేము 5 రూపాయలకు విద్యుత్ కొంటే అవినీతి ఆరోపణలు చేసిన జగన్ ఇపుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు నిలదీశారు.
కొరత ఎందుకు అంటే ఏపీలోనే కాదు, దేశమంతటా బొగ్గు సమస్య ఉందని తప్పించుకుంటున్నారు. మరి తెలంగాణకు లేని సమస్య ఏపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన చంద్రబాబు నిలదీశారు. జగన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు, విద్యుత్ పై కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు అని చంద్రబాబు అన్నారు.
ఏపీలో విద్యుత్ కొరతకు మరో కారణం కూడా చంద్రబాబు ఎత్తిచూపారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనడానికి కృత్రిమంగా విద్యుత్ కొరత సృష్టించారని కూడా టీడీపీ అధినేత ఆరోపించారు. డిస్కంలకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు బకాయి ఉన్న రూ.22 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాటికి బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యుత్ రాకుండా చేశారు. ఇపుడు 20 రూపాయలు పెట్టి కరెంటు జగన్ భాగస్వాముల కంపెనీల నుంచి కొంటున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.