సాధారణంగా ముఖ్యమంత్రి లక్ష్యం ఏమిటి ?
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం.
మరి ఏపీ సీఎం జగన్ అందరివంటి ముఖ్యమంత్రి కాదు కదా. ఆయన భిన్నమైన వ్యక్తి. అందుకే మిగతా ఎవరు ఏమనుకున్నా… రాజ్యాంగంలో, చట్టంలో… జనాలకు ఉచితంగా ప్రజల పన్నుల డబ్బు పంచకూడదు అన్ని నిబంధన లేదు. కాబట్టి, ఆ లూప్ హోల్ వాడుకుని ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.
ఎందుకంటే ఆయన లక్ష్యం ఓట్లు మాత్రమే. ఆయన కు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు. ఓటు వేసే జనాలకు నచ్చిన పని మాత్రమే చేస్తారు జగన్.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకని విచ్చలవిడి గా డబ్బు వృథా చేస్తున్నారు? అనే ప్రశ్నకు విజయ్ అనే నెటిజన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
ప్రశ్న : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకని విచ్చలవిడి గా డబ్బు వృథా చేస్తున్నారు?
జవాబు :
దీనికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం. ఇది అతని సొమ్ము కాదు కాబట్టి ←
ఇప్పుడు వారు ఖర్చుపెడుతున్న డబ్బు అంత సంక్షేమ పథకాలకు మాత్రమే. ఇందులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు.
వారు తమ ఎన్నికల మానిఫెస్టోలో పొందిపరించిన ప్రతివిషయాన్ని అమలు చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఉదాహరణకు నవరత్నాల కార్యక్రమం. ఎందుకంటే వారు అది కోరుకున్న మార్గం.
కానీ అందులో చాలా వరకు వున్నవి సంక్షేమ పథకాలు మాత్రమే.
కానీ ఈ సంక్షేమ పథకాలు అన్ని తాత్కాలికంగానే ప్రజలకు ఉపయోగపడతాయి మరియు ఇవి ఎక్కువ రోజులు ప్రజల అభివృద్ధికి దోహదనివ్వవు.
**ఈ డబ్బు ని హాస్పిటళ్లు ని అభివృద్ధి చెయ్యటంలో పెట్టుంటే వారి ఎం ఎల్ ఏ లు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళవలసిన పని తప్పివుండేది.**
ప్రజల సంక్షేమం ముఖ్యమే కానీ అది మాత్రమే అన్నట్టు ప్రభుత్వం పని చెయ్యకూడదు.
ఈ పద్దతిని ప్రజలు ఏ మాత్రం సహించరు
మరి కొన్ని కారణాలు కనక మనం విశ్లేషిస్తే డబ్బులు ఎందుకు అంతలా ఖర్చుపెడుతున్నారు?
-
చెప్పిన పని చేస్తాను అనిపించుకోవడానికి (అది ఎంత వరకు ఉపయోగకరం అనే విషయాన్నీ పక్కకుపెట్టి )
-
మరొక సారి గద్దెను ఎక్కడానికి
-
లోకల్, అసెంబ్లీ ఎన్నికలను మళ్లీ మళ్లీ గెలవటానికి. ఎందుకంటే ఈ ఎన్నికలలోని వాళ్ళ అభ్యర్థులు విజయం సాధిస్తే వారు మళ్ళీ 2024 లో గెలవటానికి ఉపయోగ పడుతుంది.
-
అన్నిటికన్నా ముఖ్యం ఇది అంతని సొమ్ము కాదు కాబట్టి (ఇది నిజం తనకున్న వేల ఎకరాలు మరియు లక్షల కోట్లు ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగించారా ?
Credit : www.quora.com