ఆర్పీ ఠాకూర్ 2018, జూన్ కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. అప్పుడైనా ఎందుకు అందరికీ తెలిసిందంటే చంద్రబాబునాయుడు ఆయన్ను డీజీపీగా నియమించారు కాబట్టే. ఏ ముహూర్తంలో ఠాకూర్ ను చంద్రబాబు డీజీపీగా నియమించారో కానీ అప్పటి నుండే ఆ పదవి బాగా వివాదాస్పదమైపోయింది. అధికారపార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపనలు చేసేది. దానికి సాక్షి వంత పాడేది.
సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున బదీలీలు చేశారు. అందులో భాగంగానే ఠాకూర్ ను కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి బదిలీ చేసేశారు. అది ఒకరకంగా పనిష్మెంట్ పోస్టని అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాగానే ఠాకూర్ బదిలీ విషయాన్ని అందరు ఊహించిందే కాబట్టి ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. అయితే మూడు రోజుల క్రితం ఇదే ఠాకూర్ ను ఎవరు ఊహించని విధంగా ఆర్టీసీ ఎండిగా జగన్ నియమించారు. ఆర్టీసీ ఎంపి పోస్టంటే చాలా కీలకమైన పోస్టని కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇంతటి కీలకమైన పోస్టులో ఠాకూర్ ను జగన్ నియమిస్తారని ఎవరూ ఊహించలేదు. మరి ఎందుకు నియమించినట్లు ?
ఎందుకంటే అప్పట్లో ఇంటెలిజెన్స్ బాస్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పైన కూడా చాలా వివాదాస్పద అధికారిగా ముద్రపడింది. ఇప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అంత కాకపోయినా ఈయనలాగే ఏబీ మీద ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే సహజంగానే ఈయనపైన వేటుపడింది.
తాజాగా తనపై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని ఏబీ అఖిల భారత సర్వీసు అధికారుల సంఘానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. తనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయటాన్ని ఏబీ కోర్టులో చాలెంజ్ చేశారు. తాము ఎవరిపైనా కక్షసాధింపులకు దిగటం లేదని ప్రభుత్వం కోర్టులో వాదిస్తోంది. తన వాదనకు మద్దతుగానే హఠాత్తుగా ఠాకూర్ ను ఆర్టీసీ ఎండిగా నియమించినట్లు సమాచారం. ఏబీ ఇష్యు లేకపోతే ఠాకూర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీలోనే రిటైర్ అయిపోయేవారేమో. మొత్తానికి తన కోసమని ఏబీ చేస్తున్న ఫైట్ వల్ల ఠాకూర్ కు లాభం జరిగింది.
దీనివల్ల జగన్ కు మరో లాభం ఉంది. జగన్ రెడ్లకు కాకుండా వేరే వాళ్లకీ పదవులిస్తాడని… చూపించుకోచ్చు కదా. పార్టీకి లాభం కలగకపోతే జగన్ ఏ పనీ చేయరన్నది జగద్విదితం.