కష్టం ఒకరిదైతే పేరు మాత్రం మరొకరికి అని అంటుంటారు.. ఇప్పుడీ మాటలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా వర్తిస్తాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలు ఏపీని అంతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయి. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ సమీప ప్రాంతాల ప్రజలకు రక్షణ కవచంగా నిలిచింది. గతంలో చినుకు పడిందంటే చాలు కృష్ణలంక వాసులు బెంబేలెత్తిపోయేవారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచేత్తేవి. దాదాపు 80 వేల మంది ప్రజలు సామాన్లు సర్దుకుని పోనరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం చొరవ చేసి కృష్ణా నదికి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో దశాబ్దాలుగా భయాందోళనకు గురి చేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తీరింది. కృష్ణలంక వాసుల ఇళ్లల్లోకి చుక్క నీరు రాకుండా పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు.
అయితే తాజాగా రిటైనింగ్ వాల్ క్రెడిట్ మొత్తం జగన్ తన ఖాతాలో వేసుకున్నారు. జగనే రిటైనింగ్ వాల్ కట్టించారంటూ నిన్నంతా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయించుకున్నారు. ఇక విజయవాడ మొత్తం మునిగితే.. జగన్ మాత్రం నేడు కృష్ణలంకకు మాత్రమే వెళ్లారు. అక్కడ దేవినేని అవినాష్ పెయిడ్ బ్యాచ్ ను దింపి.. మీరు రిటైనింగ్ వాల్ కట్టకపోతే ఈ పాటికి మేముంతా కొట్టుకుపోయేవాళ్లమంటూ జగన్ ను తెగ పొగిడించారు. కానీ నిజంగా ఆ రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారో కృష్ణలంక వాసులకు తెలుసు.
2019లో జగన్ సీఎంగా గెలిచి బాధ్యతలు చేపట్టే నాటికే.. టీడీపీ ప్రభుత్వం రూ. 140 కోట్ల వరకు ఖర్చు పెట్టి రిటైనింగ్ వాల్ నిర్మించేసింది. పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. 2019లో వరదలు వచ్చినప్పుడు ఈ రిటైనింగ్ వాలే అక్కడి ప్రజలను కాపాడింది. ఆ టైమ్ లో వాల్ పై నిలబడి అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని ఫోటోలు కూడా దిగారు. ఇప్పుడేమో కృష్ణలంక రిటైనింగ్ వాల్ క్రెడిట్ మొత్తం తనదే అని జగన్ ప్రచారం చేయించుకోవడం విడ్డూరంగా ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నారు.