దేవర.. ఎక్కడ చూసినా ఇప్పుడిదే పేరు వినపడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రేపు అట్టహాసంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద హడావుడి ప్రారంభమైంది. ప్రీ సేల్స్ పరంగా దేవర దూసుకుపోతోంది. మరోవైపు చిత్రబృందం ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దేవర లో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. దేవర, వర అనే రెండు పాత్రల్లో ఆయన యాక్ట్ చేశారు. కొడుకు వర పాత్రకు జోడిగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా.. తండ్రి పాత్ర అయిన దేవరతో శృతి మరాఠే జత కట్టింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో శృతి మరాఠేకి సంబంధించి కొన్ని షాట్స్ కూడా ఉన్నాయి.
దాంతో శృతి కూడా సినీ ప్రియులు ఆరాలు మొదలు పెట్టారు. మెయిన్ హీరోయిన్ అయిన జాన్వీతో పాటు మరాఠీ బ్యూటీ శృతికి కూడా తెలుగులో దేవర నే తొలి చిత్రం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పట్టణంలో శృతి మరాఠే జన్మించింది. గ్లామర్ ప్రపంచంపై ఉన్న మక్కువతో శృతి.. మోడలింగ్ లోకి ప్రవేశించింది. 2008లో సనాయ్ చౌఘడే అనే మరాఠీ మూవీతో శృతి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు తమిళ్, హిందీ భాషల్లో హీరోయిన్గా, సహాయక నటిగా అనేక చిత్రాల్లో నటించింది.
సినిమాలతో పాటు సీరియల్స్‌లో, వెబ్ సిరీస్‌లలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంటూ సత్తా చాటుతున్న శృతి.. 2016లో ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తోంది. ఇప్పుడు దేవరతో శృతి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాలో ఒక ఎన్టీఆర్ కి భార్యగా, ఇంకో ఎన్టీఆర్ కి తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అలరించబోతోంది. ఏదేమైనా ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ దక్కడంతో శృతి సో లక్కీ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram