ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు లో ఉన్న శేషగిరిరావు ఇంజనీరింగ్ కాలేజీలో పెను దుమారం రేగింది. ఇక్కడ 5 వేల మంది వరకు విద్యార్థులు, విద్యార్థినులు చదువుతున్నారు.ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ. అయితే.. విద్యార్థులకు, విద్యార్థినులకు కూడా.. ఇక్కడ బోధిస్తున్నారు. కాగా.. గురువారం అర్థరాత్రి పెను విషయం వెలుగు చూసింది. విద్యార్థినుల మరుగు దొడ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. చిత్రీకరించారని.. ఇలా రికార్డయిన వీడియోలను పోర్న్ సైట్లలో పెట్టారన్నది విద్యార్థినులు చేస్తున్న ఆరోపణ.
ఈ క్రమంలో అసలు విషయాలు వెలుగులోకి తీసుకురావాలని.. బాధ్యులైన `ఇద్దరి`ని అరెస్టు చేయాలన్న ది వారి డిమాండ్. ఈ క్రమంలోనే అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయంపై చర్చ సాగుతోంది. అయితే.. దీనికి రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థినులు ఆరోపిస్తున్న ఆ `ఇద్దరి`లో ఒకరు.. ఓ రాజకీయ నేత కుమార్తె. దీంతో ఈ కేసు వారం రోజులుగా వెలుగు చూడలేదు. పైగా.. ఇప్పుడు విద్యార్థినులు రోడ్డున పడ్డాక కూడా.. ఈ కేసు ఎటూ తేలక పోవడం గమనార్హం.
అసలు ఏం జరిగింది?
ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని అదే కాలేజీలో చదువుతున్న సీనియర్‌తో ప్రేమలో పడింది. వీరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. ఈక్రమంలో ప్రియుడి కోసం ఆమె.. ఇతర విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు తీసిందనేది పెద్ద ఆరోపణ. ఈ విషయం వారం కిందటే యాజమాన్యా నికి తెలిసింది. అయితే.. దీనిలో ఎంట్రీ ఇచ్చిన సదరు రాజకీయ నాయకుడు.. విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచాలని ఆదేశించడంతో కాలేజీ “మీరు మీరు తేల్చుకోండి“ అని చేతులు దులుపుకొంది.
ఇంతలో ఓ విద్యార్థిని వాట్సాప్‌కు ఓ వీడియోను ఆమె సోదరు పోస్టు చేసి.. పలు ప్రశ్నలు సంధించడంతో విషయం బహిర్గతమైంది. దీంతో విద్యార్థులు గురువారం అర్ధరాత్రి సెల్ ఫోన్ టార్చ్‌లు వెలిగించి ఆందోళనకు దిగారు. ఇదిలావుంటే.. ఈ విషయంపై ఇటు సీఎం చంద్రబాబు, అటు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. విచారణకు ఆదేశించారు. కానీ, ఇప్పటికే సదరు వీడియోలు.. పోర్న్ సైట్స్‌కు చేరిపోయాయని.. విద్యార్థినులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.