హైదరాబాద్ 500 ఏళ్ల నగరం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ హైదరాబాదు మహానగరంగా పేరుపొందింది మాత్రం చంద్రబాబు హయాంలోనే జరిగింది. పెద్ద సంఖ్యలో జనం, అన్నిరకాలవి పెద్ద పెద్ద దుకాణాలు, గవర్నమెంటు ఆఫీసులు, ప్రైవేటు ఆఫీసులు, అన్ని ప్రాంతాలకు రోడ్లు, బస్సులు, రైళ్లు ఉంటే అది నగరం అవుతుంది. కానీ మహానగరం కావాలంటే … చాలా కావాలి. ఎందుకు బెంగుళూరు అంతగా అభివృద్ధి చెందింది, ఐటీ కంపెనీలన్నీ అటే ఎందుకుపోతాయంటే… వారికి కావల్సింది పనిచేసుకునే ఆఫీసు స్థలం మాత్రమే కాదు, సోషల్ లైఫ్ కి అవకాశం ఉందక్కడ. అదే హైదరాబాదులో లేదు.
ఆ సోషల్ లైఫ్ పుష్కలంగా దొరికే హైదరాబాదును తయారుచేసింది చంద్రబాబు.సగం సగం నాలెడ్జి ఉన్నవాళ్లు అవును హైదరాబాదును గోల్కొండను, చార్మినార్ ను కట్టించింది చంద్రబాబే అని ఎగతాలి చేస్తారు. మరి అవి 400 ఏళ్లుగా ఉన్నా 2000 సంవత్సరం తర్వాతే ఎందుకు ఉమ్మడి ఆంధ్ర బడ్జెట్, ఆదాయం పెరిగింది. ఎందుకంటే సంపద సృష్టి జరిగింది.
ఎందుకంటే హైదరాబాదు మోడిఫై అయ్యింది. అంతర్జాతీయ సంస్థలకు పనికొచ్చేలా సైబరాబాద్ అనే ఒక కొత్త ప్రాంతానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందుకే నేడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అయ్యింది. ఇలా కావడానికి చంద్రబాబు హైదరాబాదులో ఏం చేశాడు?
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధించడమే చంద్రబాబు తొలి అతిపెద్ద విజయం. దీనికి సాక్ష్యం ఇది
అర్థమైందిగా… ఖజానాలో డబ్బులు తీసి కాంట్రాక్టరుతో కట్టించడం కాదు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అంటే… అనుమతులు తేవడమే విజయం. దాని వెనుక కృషి, పట్టుదల చంద్రబాబుది. దాని పరపతి పెంచేందుకు అవుటర్ రింగ్ రోడ్ ను కూడా ప్లాన్ చేసి మంజూరు చేయించుకున్నారు చంద్రబాబు.
మరి చంద్రబాబు హైదరాబాదులో ఇంకా ఏం తెప్పించారు, నిర్మించారు ?
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్…
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్..
మైక్రోసాఫ్ట్..
ఇన్ఫోసిస్..
విప్రో..
ఫ్రాంక్లిన్ Templeton…
infotech..CANBAY (Cap gemini) CA..
ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్..
రహేజా మైండ్‌స్పేస్..
VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE..
సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా)..
శిల్పారామం…
హైటెక్స్…
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ..
నల్సార్ యూనివర్సిటీ..
గాంధీ హాస్పిటల్..
ఎంఎంటీఎస్..
ప్రసాద్ ఐమాక్స్..
నెక్లెస్ రోడ్..
NTR గార్డెన్స్..
జలగం వెంగళరావు పార్క్..
KBR పార్క్..
కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..
జలవిహర్..
కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం..
సరూర్ నగర్ స్టేడియం..
చర్లపల్లి జైలు..
19 ఫ్లైఓవర్ లు..
కృష్ణ వాటర్ స్కీమ్..
మలేషియన్ టౌన్ షిప్…సింగపూర్ టౌన్ షిప్…
పోచారం ఐటి జోన్..
జీనోమ్ valley…Aleap..
ఇంటర్మీడియేట్ బైపాస్..ORR..
ఈ_సేవా కేంద్రాలు..
రైతు బజార్ లు…
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ..
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం..
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ..
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ..
ఇవన్నీ హైదరాబాదుకు సమకూరాకా ఇక్కడ సోషల్ లైఫ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాతే దీనిని అంతర్జాతీయ నగరం అని పిలిచారు. కులీకుతుబ్ షా కట్టిందే అంతర్జాతీయ నగరం అయితే… 2000 వరకు ఉద్యోగాలు ఎందుుక హైదరాబాదు కల్పించలేదో ఎవరైనా చెప్పగలరా మరి?
ఇలా టిడిపి హయం లో బాబు గారి హయం లో చేసిన అభివృద్ధి గురించి స్థాపించిన సంస్థల గురించి కల్పించిన ఉద్యోగాల గురించి సృష్టించిన సంపద గురించి పెరిగిన జీవన ప్రమాణాలు గురించి విస్తృతమైన నగర పరిణామం గురించి సవాలు చేసి చెప్తున్నాం. పైవన్నీ అబద్ధం అని ఏ ఒక్కరైనా చెప్పగలరా?