ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. తెలుగు లోగిళ్లు గొబ్బెమ్మలతో వెలిగిపోయే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…అనకాపల్లి నుంచి అమెరికా వరకు…పల్లెలనుంచి పట్నాల వరకు సందడే సందడి. పండుగ నాడు కొత్త అల్లుళ్లతో….కొత్త ధాన్యాలతో…కోడి పందేలతో గ్రామాలు కళకళలాడుతుంటాయి. అదే సమయంలో పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేలా కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి.
ఇక, సంక్రాంతి సందర్భంగా లోగిళ్లను అందంగా ముస్తాబు చేయడంలో తెలుగింటి ఆడపడుచులది అందెవేసిన చేయి. రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో ఇంటి ముందు….పచ్చటి తోరణాలతో ఇంటి లోపల అలంకరించడం ఆనవాయితీ. ఇక భోగి నాడు భోగి మంటలు వేయడం, భోగి పళ్లతో స్నానం చేయడం, సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టడం, వీధులన్నీ రంగులతో నిండిపోయేలా వెరైటీ డిజైన్లతో రంగోలీ ముగ్గులు వేయడం పరిపాటి.
ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి సందర్భంగా అమెరికాలోని ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో పాల్గొని గెలుపొందిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు కూడా అందజేస్తున్నారు. అమెరికా, భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఈ పోటీలో పాల్గొనవచ్చు. రంగోలి ముగ్గుల పోటీలు, భోగి పళ్లు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఆ మూడు కేటగిరీలలో ఏదైనా కేటగిరీని ఎంచుకొని క్లోజ్ షాట్ లో ఒక ఫొటోతోపాటు ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న వీడియోను నిర్వాహకులకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మూడు కేటగిరీలకు ఎంట్రీలను పంపవచ్చు. ఈ పోటీలో పాల్గొనదలచినవారు తమ ఫొటో, వీడియో రెండింటినీ president@