కష్టాల్లో ఉన్న భారతీయుల్ని ఆదుకునేందుకు ఆస్ట్రేలియాలో నాలుగు నెలల కిందట ఏర్పాటైన స్వచ్ఛంద సేవా సంస్థ..’వుయ్ కేర్’. 100 మందికి పైగా వాలంటీర్లతో ఆరంభమైన ఈ సంస్థ ఇప్పటికే 55 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల విరాళాల్ని సేకరించిందీ సంస్థ.ఇండియాలో కష్టాల్లో ఉన్న 20కి పైగా కుటుంబాలకు ఈ మొత్తాన్ని అందజేసి వారి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చారు.
ఇప్పుడు మరో బృహత్తర లక్ష్యంగా ‘వుయ్ కేర్’ ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్కు శ్రీకారం చుట్టింది.మైగ్రేషన్ ఆర్కాడియా, కెన్సలిస్ట్ హార్బర్ క్రికెట్ లీగ్ సహకారంతో ఈ మ్యాచ్ను ‘వుయ్ కేర్ ‘నిర్వహించనుంది.జనవరి 24న ‘వుయ్ కేర్ ‘హిట్స్, వెల్ఫేర్ టైటాన్స్ జట్ల మధ్య వేల్స్లోని వాల్షా పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది.
సుజీవన్ కుమార్, పేరు, రమేష్ దోవ, వంశీ, రాకేశ్ల ఆధ్వర్యంలో మ్యాచ్ను నిర్వహించారు.మ్యాచ్ ద్వారా సేకరించిన విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు .పేద విద్యార్థులకు, అనారోగ్యంతో బాధ పడుతున్న అభాగ్యులకు సాయం చేసే లక్ష్యంతో ‘వుయ్ కేర్’ ఈ మ్యాచ్ను నిర్వహించింది.
‘వుయ్ కేర్’ హిట్స్ జట్టులోనజీర్ జలీల్ (కెప్టెన్), రాకేష్, నిపుణ్, రాకీ, వీరేన్ సింగ్, తుషార్ మీనన్, విమల్, నజీర్, నీరజ్, ప్రదీప్, రోహిత్ ఉండగా..వెల్ఫేర్ టైటాన్స్ జట్టుకు సాంబ (కెప్టెన్), రాజ్ పొట్ట, రంజిత్, జమాల్ నజీర్, వలీద్ జలీల్, నవీన్, నఖీబ్, ప్రకాష్, నిఖిల్, యాజిర్ అలీ, వంశీ ఆద్యర్యములో, ఎర్ర బంతితో నిర్వహించిన ఈ మ్యాచ్లో ,ఒక్కో జట్టుకు 30 ఓవర్లు ఆడారు.