సంక్రాంతి సందర్భంగా రెండు భారీ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ దగ్గర తెలుగువారి సందడి మొదలైంది.
సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చిందా అన్న రీతిలో CineMax 4K దగ్గర తెలుగోళ్లంతా సినీ పండగ చేసుకుంటున్నారు.
ఆల్రెడీ బాలయ్య బాబు నటించిన వీర సింహా రెడ్డి సినిమా చూసేందుకు నందమూరి అభిమానులు నిన్న బారులు తీరారు.
ఇక, తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చూసేందుకు మెగా అభిమానులు కూడా థియేటర్ కు క్యూ కడుతున్నారు.
చాలా రోజుల తర్వాత చిరంజీవి పక్కా మాస్ ఎంటర్ టైనర్ లో నటించడంతో అమెరికాలోని బే ఏరియాలో వాల్తేరు వీరయ్య పూనకాలతో లోడ్ అయింది.
చిరంజీవి ఫొటోలు, కటౌట్లకు కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు.
మెగా అభిమానులు వీరబాబు ప్రత్తిపాటి, మురళి గొడవర్తి, రమణ్ సంచుల, శివ మొలబంతి, రెడ్డయ్య ప్రత్తిపాటి, కిరణ్ ఎనుగుంతల, అనిల్ అరిగె, సునీల్ పసుపులేటి, కిరణ్ విన్నకోట, దుర్గా పెద్దిరెడ్డి, చరణ్ కనపర్తి, రాజా సింహాద్రి, మూర్తి పిట్టా, సత్య యలమంచిలిల ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి.
CineMax 4K (a.k.a Serra) మేనేజింగ్ పార్టనర్ మోహన్ సుగ్గల ఈ కార్యక్రమానికి వచ్చిన మెగా అభిమానులకు పేరు పేరున అభినందనలు తెలియజేశారు.