దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన తనయుడు వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ ను అడ్డుపెట్టుకొని జగన్ వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ప్రచారం జరిగింది. అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో కేసులలో జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు కూడా వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు.
అయితే, ఆనాడు వైఎస్సార్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ప్రథమ ముద్దాయిగా ఉంది. అయితే, ముందుగా వైఎస్సార్ పేరు ఎఫ్ ఐఆర్ లో చేర్చలేదు. కానీ, పట్టుబట్టి మరీ ఓ వ్యక్తి ఆయన పేరును అందులో చేర్చారని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆనాడు వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఆయన తనయుడు జగనేనని మాజీ కేంద్ర మంత్రి, వైఎస్ విధేయుడిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ నిజాలు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వీడియోను టీడీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విటర్ లో షేర్ చేశారు. ‘‘వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది జగన్మోహన్ రెడ్డి…ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టేందుకు కోర్టు ఒప్పుకోకుంటే…సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ అనుమతి తీసుకువచ్చి రాజశేఖర్ రెడ్డిని ప్రథమ ముద్దాయిని చేసింది జగన్మోహన్ రెడ్డి…వైఎస్, ఆయన మంత్రి వర్గం అందరూ కలిసి చేశారు తప్పించి నాకేంటి సంబంధం’’ అని జగన్ ఆనాడు చెప్పినట్లు ఉండవల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే. pic.twitter.com/NE3B4Qc7OO
— Lokesh Nara (@naralokesh) September 26, 2022