‘నభూతో నభవిష్యతి’ అన్న విధంగా పనిచేసి.. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్న ‘టీం తానా-2021’ కి ఓటు వేసి గెలిపించుకోవడం ద్వారా ‘తానా’ ఔన్నత్యాన్ని, సేవాభావాన్ని మరింత ఇనుమడింపజేసుకునే అవకాశం మనకు లభించింది.
‘తానా టీం’ ఇదే–
శశికాంత్ వల్లేపల్లి..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ‘తానా’ వ్యవస్థాపక ట్రస్టీ
‘తానా’కు తన సొంత డబ్బు 3 లక్షల డాలర్లు విరాళం ఇచ్చిన దాత.
అంతేకాదు.. మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలకు గడిచిన 4-5 ఏళ్లలో 5 లక్షల డాలర్లు విరాళాలుగా అందించి తన మనసు చాటుకున్నారు.
విద్య గారపాటి..
ప్రముఖ పారిశ్రామిక వేత్త
‘తానా’ నాయకత్వంలో పనిచేసిన అనుభవం ఉంది
లక్షా 70 వేల డాలర్లను ‘తానా’ కార్యకలాపాలకు విరాళంగా ఇచ్చి.. తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో `గ్రేస్ ఫౌండేషన్` ద్వారా కేన్సర్ శిబిరాలు నిర్వహించారు.
రవి మందలపు..
ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత ‘తానా’ వ్యవస్థాపక ట్రస్టీ
‘తానా’ కార్యక్రమాలకు దాదాపు 2 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో `జన్మభూమి` ద్వారా 100 డిజిటల్ పాఠశాలల స్థాపనకు కృషి చేశారు.
సత్యనారాయణ మన్నే..
ప్రముఖ పారిశ్రామికవేత్త
19 సంవత్సరాలుగా ‘తానా‘/GWTCS నాయకుడిగా ఉన్నారు.స్వచ్ఛంద సంస్థలకు వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కొరకు `గ్రేస్ ఫౌండేషన్` కి బస్సు కొనటానికి వ్యక్తిగత డొనేషన్ తో పాటు, దాతల ద్వారా నిధుల సేకరణ
‘కావేరి కాలింగ్‘ కార్యక్రమానికి ఇషా ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగత డొనేషన్ తో పాటు, దాతల ద్వారా నిధుల సేకరణ. స్కూల్ పిల్లల స్కాలర్షిప్స్ కొరకు నిధుల సేకరణ
రాజా సూరపనేని..
21 సంవత్సరాలుగా ‘తానా’కు సేవలు అందిస్తున్నారు
అనేక స్వచ్ఛంద సంస్థలకు వేల కొద్దీ డాలర్లు విరాళంగా ఇచ్చిన తన ఉదారతను చాటుకున్నారు.
కేన్సర్ శిబిరాలకు చేదోడుగా నిలిచారు.
గత ఎన్నికల్లో ‘తానా’కు లక్ష డాలర్లు మిగిలించారు.
శ్రీనివాస్ ఎండూరి..
గత 23 ఏళ్లుగా ‘తానా’, ‘ఏపీఎన్ఆర్టీ’, కనెక్టికట్ తెలుగు అసోసియేషన్లకు వేలాది డాలర్లు విరాళం ఇచ్చిన దాత
కేన్సర్ క్యాంపులు నిర్వహించడంతోపాటు.. విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ప్రదానం చేశారు.
వరప్రసాద్ ఎడన
గత 20 ఏళ్లుగా ‘తానా’, తామా(అట్లాంటా), సిడ్నీ తెలుగు అసోసియేషన్లో పనిచేశారు. తానా క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు.
ట్వీమ్ స్క్వేర్ సహా పలు స్వచ్ఛంద సంస్థలకు భూరి విరాళాలు సమర్పించిన దాత
‘టీం తానా'(ఫౌండేషన్ ట్రస్టీస్) నిబద్ధత/మేనిఫెస్టో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కేన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ
వ్యక్తిగత నిధులతో 12 క్యాంపులు, ఇతర దాతల నిధులతో 12 క్యాంపుల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నేత్ర చికిత్సా క్యాంపుల నిర్వహణ
వ్యక్తిగత నిధులతో 12 క్యాంపులు, ఇతర దాతల నిధులతో 12 క్యాంపుల నిర్వహణ
చేయూత స్కాలర్ షిప్పులు
అమెరికా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నిర్వహణ
వ్యక్తిగత నిధులతో 300 స్కాలర్ షిప్పులు, ఇతర దాతల నిధులతో 300 స్కాలర్ షిప్పులు
చేయూత.. అనాధ పిల్లల దత్తత
వ్యక్తిగత నిధులతో 100 మంది చిన్నారులను, ఇతర దాతల నిధులతో మరో 100 మందిని దత్తత తీసుకోవడం
చేయూత.. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు అందజేయడం
వ్యక్తిగత నిధులతో 500 మందికి, ఇతర దాతల నిధులతో మరో 500 మందికి అందజేయడం.
చేయూత.. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులను దత్తత తీసుకోవడం
వ్యక్తిగత నిధులతో 100 మందిని, ఇతర దాతల నిధులతో మరో 100 మందిని దత్తత తీసుకోవడం.
పాఠశాలలు, గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు
వ్యక్తిగత నిధులతో 12, ఇతర దాతల నిధులతో మరో 12 ఏర్పాటు చేయడం.
పాఠశాలల మౌలిక స్వరూపం మార్చడం
పాఠశాలల మౌలిక స్వరూపం మార్చడం ప్రధాన లక్ష్యంగా తానా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, మరుగు దొడ్ల నిర్మాణం, ఆర్ వో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం
వ్యక్తిగత నిధులతో 5 పాఠశాలలు, దాతల సాయంతో మరో 10 పాఠశాలలను అభివృద్ధి చేయడం.
రైతు సేవ..
రైతులను వినియోగదారులతో అనుసంధానించడం
5 గ్రామాల్లో వ్యక్తిగత నిధులతో, మరో ఐదు గ్రామాల్లో దాతల నిధులతో చర్యలు తీసుకోవడం.
ఆదరణ పథకం..
ఆదరణ పథకానికి చేయూతను అందించడం
అవసరం ఉన్న వారికి కొవిడ్-19 టీకా అందించడం
భవిష్యత్తులో..
‘తానా స్కూల్’, అనాథ ఆశ్రమాల ఏర్పాటు చేయడం
ఆయా లక్ష్యాల సాధనకు ఇప్పటికే 70 వేల డాలర్లను విరాళంగా అందజేశారు.
సో.. ఇన్ని లక్ష్యాలు, ఇంత సేవ చేస్తున్న నరేన్ కొడాలి టీంకే ఓటు వేయాలని అభ్యర్థన.