విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ జరిగిపోవడం ఖాయం.. దీనిని ఎవరూ ఆపలేరు.ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే కుండ బద్దలు కొట్టినట్టు పరోక్షంగా చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయంపై ముసురుకున్న అనుమానపు మేఘాలు తొలిగిపోయా యి. ఇక, ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఎలా ముందుకు సాగుతారు? అనేది కీలకంగా మారింది.
విషయంలోకి వెళ్తే.. పెట్టుబ డులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ నిర్వహించిన వెబినార్లో తాజాగా మోడీ మాట్లాడారు. 2021-22 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్కరణల గురించి వివరించారు. వ్యాపారంతో, పరిశ్రమల నిర్వహణతో ప్రభుత్వానికి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం దృష్టి ప్రజా సంక్షేమంపైనే ఉండాలన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తప్పనిసరి అని మోడీ తేల్చేశారు. ‘మోనిటైజ్ అండ్ మోడర్నైజ్’ అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం మోనిటైజ్ (నగదు రూపంలోకి మార్చడం) చేస్తే, ఆ స్థానంలోకి ప్రైవేటు రంగం వస్తుందన్నారు.
ప్రైవేటు రంగం వస్తే పెట్టుబడులు వస్తాయని, అత్యుత్తమ స్థాయి అంతర్జాతీయ విధానాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. వీటి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చుపెట్టవలసి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కోసం నడపకూడదని చిలకపలుకులు పలికారు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. ప్రైవేటు రంగం వల్ల సమర్థత పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేష న్ చేయడం వల్ల వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.
అనేక ప్రభుత్వ ఆస్తులు వాటి సామర్థ్యా నికి తగినట్లు పని చేయడం లేదని తెలిపారు. వీటిని మానిటైజ్ చేసి రూ.2.5 లక్షల కోట్లు సేకరిస్తామని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి తన ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు.
అంతా ఓకే గాని… గుజరాత్ లో ఉన్న ప్రభుత్వం సంస్థలను ఎందుకు అమ్మరు? ఆంధ్రప్రదేశ్ లో, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులు, కంపెనీలనే ఎందుకు అమ్ముతారు అన్నది ప్రశ్న ఇక్కడ. గుజరాత్ లోని ప్రభుత్వ కంపెనీలను ముందు ప్రైవేటుకు అమ్మేసి అపుడు మిగతావి అమ్మితే మోడీని జనం నమ్మే అవకాశం ఉంటుంది.