ఫైర్ బ్రాండ్ విజయశాంతి కేసీఆర్ పనులను చీల్చిచెండాడే కాంగ్రెస్ నేతల్లో ఒకరు. సాధారణంగా విజయశాంతి స్పందన చాలా లౌక్యంగా డీప్ గా ఉంటుంది. కానీ ఈరోజు ఆమె చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. క్లారిటీ లేకుండా విజయశాంతి చేసిన కామెంట్లు చూసిన వారు ఆమె ఏం చెప్పాలనుకుంటోంది, అసలు ఆమె ఆవేదనలో అర్థమే లేదంటున్నారు.
అది సరే, విజయశాంతి ఏమంది?
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి.
ఇది ఆమె చేసిన కామెంట్.
కేసీఆర్ కాంగ్రెస్ ను చంపకపోతే బీజేపీ తెలంగాణలో ఎదిగేది కాదు అన్నది ఆమె అంతరార్థం. అనవసరంగా కాంగ్రెస్ పీక పిసికావు బీజేపీని ని నువ్వే పెంచి పెద్ద చేసుకున్నావు అని చెప్పడం ద్వారా కేసీఆర్ రిస్కును గుర్తుచేయాలని ఆమె అనుకుంది కానీ… జనాలకు ఇంకో రకంగా అర్థమయ్యాయి ఆమె కామెంట్లు. ఇపుడు కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారి పోయిందని ఆమే స్వయంగా ఒప్పుకున్నట్లయ్యింది. బీజేపీని రాకుండా ఉండటానికి కాంగ్రెస్ ను బతికించి ఉండొచ్చు కదా అన్నట్టుంది ఆమె వ్యాఖ్యానం.
ఇంకో పార్టీ ఎలా రాజకీయం చేయాలో విజయశాంతి ఎలా చెబుతోంది. అయినా ప్రతిపక్షం బీజేపీ అయితే ఏంటి; కాంగ్రెస్ అయితే ఏంటి?… వాస్తవానికి రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటే అది కూడా కేసీఆర్ కు మేలే కదా. తన వ్యతిరేక ఓట్లు చీలుతాయి కదా. మరి విజయశాంతి ఎందుకు ఇలా మాట్లాడినట్లు? ఇక ఆమె ట్వీట్లో కాంగ్రెస్ స్టేట్ ఇన్ ఛార్జిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు.
అయినా కేసీఆర్ గురించి రాములమ్మ అంత ఆవేదన ఎందుకు చెందారో మరి. సాధారణంగా మంచి క్లారిటీతో మాట్లాడే మేడమ్ సినిమాల్లోకీ రీఎంట్రీ ఇచ్చాక రాజకీయాలపై క్లారిటీ కోల్పోయిందా? ఏంటి?