వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఆయనపై వచ్చిన ఆరోపణలు, వివాదాలు ఒక ఎత్తైతే.. తాజా వివాదం మరొక ఎత్తు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఫిర్యాదు నమోదు అయింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్.. దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
తాను విదేశాల్లో ఉండగా ఇండియాలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో మదన్ మోహన్ పేర్కొన్నాడు. అయితే తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ కోరుతూ మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. దీంతో విజయసాయి రెడ్డి పేరు గత కొన్ని గంటల నుంచి మీడియాలో మారుమోగిపోతంది.
లేటు వయసులో ఓ అధికారి భర్త నుంచి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా, వైకాపా ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి వ్యవహరించింది. ఆమెకు ఆ పోస్ట్ విజయసాయి రెడ్డే ఇప్పించారని అంటుంటారు. విశాఖ పర్యటనలో విజయసాయి రెడ్డి ఉంటే.. ఆమె వెంట శాంతి కూడా కనిపించేవారు.
మరోవైపు వైసీపీ పెద్దలకు నమ్మకంగా ఉంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణులు శాంతిపై ఉన్నాయి. అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతికి పేరుంది. దీంతో కొత్త ప్రభుత్వం రాగానే దేవదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు శాంతి భర్త స్వయంగా ఆమెపై దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం, అందులో విజయసాయి రెడ్డి పేరు పెట్టడం పెను సంచలనం రేపుతోంది.