విశాఖలో ఈ రోజు విజయసాయిరెడ్డి పరిస్థితి ముడ్డిలో పుండు..మేనమామ వైద్యంగా మారింది.
మింగలేక, కక్కలేక బాధితులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, మీడియా ఎదుట మరోసారి వెర్రిపువ్వు అయ్యాడు.
మీడియా వాళ్లను వెంటబెట్టుకుని కరోనా వైరస్ బామ్మర్దిలా పీపీఈ కిట్టేసుకుని కోవిడ్ వార్డులోకి దూసుకెళ్లాడు.
అక్కడ సౌకర్యాలు ఏమీ బాగాలేవని, కోవిడ్ పేషెంట్ల బంధువులు మీద పడేసరికి జారుకున్నాడు.
కలెక్టరేట్లో 104 కాల్ సెంటర్కి చేరాడు.. అక్కడ ఒక రేంజులో బిల్డప్ ఇచ్చాడు..104కి కాల్ చేస్తే కాల్ కలవనే లేదు.
ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి అని 104 వాళ్లని గద్దిస్తే..
ఇది సీఎం భార్య భారతి గారి మౌరిటెక్ ది, ఏం పీక్కుంటావో పీక్కోమని మొఖంమీదే చెప్పారట.
బాబాయ్-బాత్రూమ్భయంతో టాపిక్ డైవర్ట్ చేసి సరే! రోజుకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ఎందరికి బెడ్లు అరెంజ్ చేస్తున్నారని 104 మేనేజర్ని అడిగారు విజయసాయిరెడ్డి.
రోజుకి తక్కువలో తక్కువ 300 కాల్స్ కోవిడ్ బెడ్స్ కోసం వస్తున్నాయని..గరిష్టంగా 6 బెడ్లు అరేంజ్ చేయగలుతున్నామని వారిచ్చిన సమాధానంతో మైండ్ బ్లాంకయ్యింది.
ఫోన్ చేసినా 104, 108 వాహనాలు ఎందుకు రావడంలేదని సాయిరెడ్డి అడిగేసరికి…104,108 బాధ్యతలు అరబిందోవని..అది మీ అల్లుడిదే కాబట్టి ఆయననే అడగమన్నారట!
కోవిడ్ టెస్టులు చేసే కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లోకి వెళ్లిన సాయిరెడ్డి ప్రశ్నలు అడిగితే..ఇక్కడ కనీససదుపాయాలు లేకుండా ఎలా టెస్టులు చేస్తామని వారు ఎదురు ప్రశ్నించారు.
24 గంటల్లో కోవిడ్ టెస్టు రిజల్ట్ ఇవ్వాలని అని ఆదేశిస్తే…పనిభారం, సిబ్బంది కొరత వల్ల వారం లోగా ఇవ్వలేమని తేల్చేశారు వైరాలజీ ల్యాబ్ నిర్వాహకులు.
ఎటువైపు వెళ్లినా..తనవైపే వస్తోందని… ఈ సారి విమ్స్ హాస్పిటల్ మీదకి దండెత్తాడు విజయసాయిరెడ్డి.
అక్కడ మొదట్లోనే కోవిడ్ పేషెంట్ల బంధువులు… మా ఉసురు మంట మీకు తగల అంటూ శాపనార్థాలు పెట్టారు.
ట్వీట్చేసి అయినా, ప్రెస్మీట్ పెట్టి అయినా, చివరకి ఫీల్డ్ విజట్ చేసి అయినా కడుపు నిండా తిట్లు తింటే కానీ నిద్రపట్టని ఏ2కి ఈ రోజు వెళ్లిన చోటల్లా అమ్మనాబూతులతో ఫుల్ మీల్స్ పెట్టారట.