చెన్నయ్ లో ప్రాక్టీసు చేసుకునే ఛార్టెడ్ ఎకౌటెంట్ సాయిరెడ్డి అనూహ్య రీతిలో రాజకీయాల్లోకి వచ్చారు.నేరు రాజకీయాల్లో పోటీ చేయకపోయినా నేరు రాజకీయాలను అమితంగా ఇవాళ ప్రభావితం చేస్తున్నారు. వైసీపీకి కర్త మరియు కర్మ అన్నీ ఆయనే.క్రియ కూడా ఆయనే అని రాయాలి.
జగతి పబ్లికేషన్స్ తో సహా చాలా వ్యవహారాల్లో తలమునకలయి ఉండే సాయిరెడ్డి అకౌంటెంట్ బాధ్యతలు వదిలి రాజకీయం వైపు రావడమే విడ్డూరం. అంతేకాదు ఆయన విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేయడం ఇంకా విడ్డూరం. పాపం ఈ నెల్లూరోడు ఇంత స్థాయి వస్తాడని ఇంతగా ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాడని మంత్రి బొత్స కూడా ఏనాడూ అనుకోలేదని సమాచారం.
అందుకే బొత్స ప్రయివేటు సంభాషణల్లో ముగ్గురంటే ముగ్గురుపై మండిపడుతున్నారని సమాచారం.వారిలో ఒకరు సాయిరెడ్డి, మరొకరు పెద్దిరెడ్డి, ఇంకొకరు రామకృష్ణా రెడ్డి. అన్నీ వీళ్లకే చెప్పి చేయాలా? అంటూ చాలా సార్లు ఫైర్ అయ్యారు కూడా!
ఆ మాటకు వస్తే విశాఖ ఎంపీని డమ్మీ చేసిన ఘనత కూడా సాయిరెడ్డిదేనని అంటారు సొంత పార్టీ సభ్యులే. అవంతి శ్రీను కూడా సాయిరెడ్డిపై గుర్రుగా ఉన్నా పెద్దగా అనగా బాహాటంగా ఆయన్ను వ్యతిరేకించేందుకు తనకున్న శక్తి చాలదని గ్రహించాక సైలెంట్ అయిపోయారు. మధ్యలో ఆయనకు సంబంధించి అసభ్యకర రీతిలో మాట్లాడారు అన్న అభియోగంపై విడుదలయిన కొన్ని ఆడియో టేపుల వ్యవహారాల వెనుక చాలా మంది సొంత పార్టీ సభ్యులే ఉన్నారని టాక్. వీరిని కూడా ఓ వైసీపీ ప్రభుత్వ పెద్దే ప్రోత్సహించారని ఓ అభియోగం ఉంది.
ఇదొక్కటే కాదు విశాఖ కేంద్రంగా సహజవనరులు తరలిపోయేందుకు నిబంధనలు విరుద్ధంగా పనులు జరిగిపోతున్నందుకు ఇలా ఒక్కటేంటి ఎన్నింటికో సాయిరెడ్డే కారణం అన్న టాక్ ఉంది. ఇదే విషయం టీడీపీ పదే పదే అంటోంది కూడా!
ఇదే విషయమై ముఖ్యమంత్రి కూడా సాయిరెడ్దిని నిలువరించే ప్రయత్నం ఒకటి చేశారని కూడా తెలుస్తోంది. ఏదేమయినప్పటికీ జూలైలో రిటైర్ అయ్యే సాయిరెడ్డి ఎందుకనో కాంగ్రెస్ కు ఇవాళ థాంక్స్ చెప్పారు. తాను ఇక్కడి వరకూ వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని సెటైర్లు వేశారు.
ఆ సమయంలో జై రాం రమేశ్ ను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు చెప్పారు. ఇవి విని చైర్మన్ హోదాలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవ్వుకున్నారు.