ఈ మధ్య తమిళ స్టార్లు ఒక్కొక్కరుగా తెలుగు దర్శకులతో జట్టు కడుతుండటం తెలిసిందే.
ఇప్పటికే వంశీ పైడిపల్లితో తమిళ టాప్ స్టార్ విజయ్ ఓ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరితో ధనుష్, అనుదీప్‌తో శివ కార్తికేయన్ సినిమాలు లైన్లో పెట్టారు.
నిజానికి ఈ జాబితాలో సుకుమార్ కూడా ఉండాల్సిందట. వంశీ పైడిపల్లి కంటే ముందు సుకుమార్‌తోనే సినిమా చేయాలని విజయ్ భావించాడట.
సుకుమార్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లో ఒకడని అందరికీ తెలుసు. కానీ ఆయనతో పని చేయడానికి తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ కూడా ఆసక్తి చూపించాడన్న విషయం ఇప్పుడు వెల్లడైంది.
ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ విషయం చెప్పాడు.
విజయ్ తనతో సినిమా చేయాలని భావించిన సంగతి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తనకు చెప్పినట్లు సుకుమార్ తెలిపాడు.
‘ఆర్య’ దగ్గర్నుంచి ‘రంగస్థలం’ వరకు సుకుమార్ తీసిన చాలా సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్.
ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా చాలా క్లోజ్. ‘రంగస్థలం’ తర్వాత ఓ సందర్భంలో రత్నవేలు తనతో మాట్లాడుతూ.. విజయ్ తనతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించాడని సుకుమార్ తెలిపాడు.
ఐతే ఈ విషయమై సంప్రదింపులేమీ జరగలేదని.. తాను ‘పుష్ప’ సినిమాను మొదలుపెట్టడంతో ఆ సంగతి పక్కకు వెళ్లిపోయిందని సుక్కు తెలిపాడు. విజయ్‌తో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని, అది తన స్టయిల్లోనే డిఫరెంట్‌గా ఉంటుందని సుక్కు తెలిపాడు.
ఇక తమిళ సినిమాలు ఎప్పట్నుంచో తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని.. రంగస్థలం, పుష్ప లాంటి రస్టిక్ మూవీస్ తీయడానికి తమిళ చిత్రాల నుంచి తాను స్ఫూర్తి పొందానని సుక్కు వెల్లడించాడు. తమిళం నుంచి ఏ సినిమాను మీరు రీమేక్ చేయాలనుకుంటారని అడిగితే.. విక్రమ్ వేద అని వెల్లడించాడు సుక్కు.
ఈ సినిమా తనకెంతో నచ్చిందని, ఎవరైనా ఆ టైంలో రీమేక్ ప్రపోజల్‌తో తనను కలిసి ఉంటే తాను ఆ చిత్రాన్ని రీమేక్ చేసేవాడినని సుక్కు వెల్లడించడం విశేషం.
సుకుమార్-రజినీకాంత్.. ఒక కుర్చీ కథ
వైరల్ ఫొటోలు.. రసపట్టులో జాక్వలిన్, సుకేశ్